ఈ ఏడాది సంక్రాంతి సీజన్ ఆరంభానికి కొన్ని వారాలు ముందు వరకు పండుగకు రిలీజ్ అయ్యే సినిమాల్లో అన్నిటికంటే చిన్నది లాగా కనిపించింది హనుమాన్. కానీ ఎవరు ఊహించని విధంగా ఇది సంక్రాంతి సినిమాల్లో బిగ్గెస్ట్ మూవీగా అవతరిస్తోంది. రిలీజ్ కు ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ నుంచే అదిరిపోయే టాక్ తెచ్చుకొని.. హౌస్ ఫుల్స్ తో నడవడం మొదలైంది హనుమాన్.
ఇక అక్కడి నుంచి ఈ సినిమా అస్సలు తగ్గట్లేదు. పెద్ద పెద్ద చిత్రాలకు కూడా లేనంతగా ఈ సినిమా టికెట్ల కోసం డిమాండ్ ఏర్పడింది. పెట్టిన షోలు పెట్టినట్లు సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి. అదనపు షోల కోసం డిమాండ్ విపరీతంగా ఉంది. బుక్ మై షోలో హనుమాన్ టికెట్ల అమ్మకాల ట్రెండ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.
హనుమాన్ ఒక్కదానికి అమ్ముడు అవుతున్న టికెట్లు.. మిగతా మూడు సంక్రాంతి సినిమాల సేల్స్ కంటే ఎక్కువ ఉండడం విశేషం. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు 24 గంటల వ్యవధిలో హనుమాన్ కు బుక్ మై షో లో 3.96 లక్షల టికెట్లు అమ్ముడైతే.. మహేష్ బాబు మూవీ గుంటూరు కారం టికెట్లు లక్షన్నర సేల్ అయ్యాయి.
నాగార్జున సినిమా నా సామి రంగకు 96 వేల టిక్కెట్లు.. వెంకటేష్ మూవీ సైంధవ్ కు 47 వేల చొప్పున టిక్కెట్లు తెగాయి. బడ్జెట్, బిజినెస్, స్టార్ కాస్ట్ పరంగా హనుమాన్ కంటే పెద్ద సినిమాలు అయిన గుంటూరు కారం, నా సామి రంగ, సైంధవ్ మూడు కలిపినా కూడా టికెట్ల అమ్మకాలు మూడు లక్షలు లోపే ఉన్నాయి. కానీ హనుమాన్ 24 గంటల వ్యవధిలో వీటి కంటే లక్ష టికెట్లు ఎక్కువే సేల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. హనుమాన్ ప్రభంజనానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు.
This post was last modified on January 15, 2024 11:18 pm
ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…