మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 156 టైటిల్ అఫీషియల్ గా వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు ‘విశ్వంభర’నే కన్ఫర్మ్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ గత నెల నుంచే ప్రారంభమైనా హీరోకు సంబంధించిన సన్నివేశాలను అతి త్వరలో మొదలుపెట్టబోతున్నారు. సంక్రాంతి తర్వాత సెట్స్ లో అడుగు పెట్టేలా చిరు ముందే వేసుకున్న ప్రణాళికకు అనుగుణంగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం, చోటా కె నాయుడు ఛాయాగ్రహణం అందించారు.
ఇందాక కాన్సెప్ట్ ని వివరించే చిన్న గ్లిమ్ప్స్ విడుదల చేశారు. వీడియోని పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందించారు. భూమి, ఎన్నో వందల గ్రహాలు, పై నుంచి కింద పడిన ఉల్కా లాంటి వస్తువు, దాని వెనుక ఏదో అంతు చిక్కని రహస్యం, ఆంజనేయుడు రక్షగా ఉన్న నేలమీద వాలిన ఆ అపురూపమైన ఆయుధం లాంటి పెట్టె చెప్పే కథేంటో, విశ్వంభర ఏం చేయబోతున్నాడో తెలియాలంటే 2025 సంక్రాంతి దాకా ఎదురు చూడాల్సిందే. యువి సంస్థ దీని మీద సుమారు 200 కోట్ల బడ్జెట్ పెట్టబోతోందనే వార్త ఇంతకు ముందే వచ్చింది. షాట్స్ చూస్తుంటే అంతకంటే ఎక్కువే ఖర్చైనా ఆశ్చర్యంలేదనిపిస్తోంది .
అంచనాలను మొదలుపెట్టే కోణంలో యువి సంస్థ విజయం సాధించింది. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత భోళా శంకర్ తో డీలా పడ్డ అభిమానులు ఈసారి ఏడాది వెయిట్ చేయాల్సిందే. నిర్మాణానికి ఎక్కువ సమయంతో పాటు ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కుడ డిమాండ్ చేస్తాయి కాబట్టి దానికి అనుగుణంగానే 2025 సంక్రాంతి రిలీజ్ ని టార్గెట్ చేసుకున్నారు. హీరోయిన్లు, ఇతర క్యాస్టింగ్ వివరాలు ఇంకా బయటికి చెప్పడం లేదు. చాలా టైం ఉంది కాబట్టి సందర్భానికి తగ్గట్టు అప్డేట్స్ రూపంలో వదులుతారు. సో మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ గేమ్ మొదలుపెట్టొచ్చు.
This post was last modified on January 15, 2024 5:38 pm
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…