భార్యా భర్తల మధ్య విడాకులు ఆ జంటకు వర్తిస్తుంది కానీ పిల్లలకు రెండు కుటుంబాల మధ్య అనుబంధాన్ని కాదు. రేణు దేశాయి తో విడిపోయినా పవన్ కళ్యాణ్ వారసుడిగానే అకీరా నందన్ ని చూస్తున్నారు అభిమానులు. కుర్రాడు టీనేజ్ వయసు దాటేస్తున్నాడు. చదువు కొనసాగిస్తున్నాడు కానీ రూపం మాత్రం హీరో లక్షణాలకు మ్యాచ్ అవుతోందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా మొత్తం మెగా అల్లు ఫ్యామిలీలు బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే. జనసేన పనుల వల్ల ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప పిల్లా పీచుతో సహా మెగా గ్యాంగ్ మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా అకీరా, ఆద్య ఇద్దరూ కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతోంది. బాబు మీసాలు గెడ్డంతో దర్శక నిర్మాతలకు తన మీద ఒక ఐడియా వచ్చేలా క్లూస్ ఇస్తున్నాడు. టాలీవుడ్ కు పరిచయం చేయడం గురించి రేణు దేశాయ్ పలు సందర్భాల్లో అంతా ఆసక్తి లేదనే సంకేతం ఇచ్చినప్పటికీ అంతర్గతంగా లాంచ్ చేయించే ప్లాన్ అయితే జరుగుతోందట. అయితే పవన్ గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తాడనేది కీలకం. పవన్ ఆఖరి సంతానం ఇంకా చాలా చిన్న వయసు కాబట్టి ఫ్యాన్స్ చూపు అకీరా మీదే ఉంది. తగిన శిక్షణ ఇచ్చి దింపితే మంచి కెరీర్ సెట్ చేసుకోవచ్చని అంటున్నారు.
ఇది తేలడానికి టైం అయితే పడుతుంది. ఎందుకంటే వారసుల విషయాల్లో తల్లితండ్రుల నిర్ణయాలే కీలకం. చిరంజీవి, పవన్ చెబితే రేణు దేశాయ్ నో అనకపోవచ్చు కానీ ఎంట్రీ ఎప్పుడు అనేదే సస్పెన్స్. ఒక్కసారి ఎస్ అనాలే కానీ నిర్మాతలు క్యూ కట్టేస్తారు. పైగా పవన్ సినిమాల మీద ఎక్కువ ఆసక్తి చూపించడం లేదు. కేవలం జనసేనని బలపరచడం కోసం రెమ్యునరేషన్లు తీసుకుని నటించడమే కానీ సీరియస్ కెరీర్ మీద ఫోకస్ పెట్టడం లేదు. అలాంటప్పుడు ఫ్యాన్స్ సహజంగా అకీరానే కోరుకుంటారు. మరి జూనియర్ పవర్ స్టార్ ఎప్పుడు వచ్చేది కాలమే సమాధానం చెప్పాలి.
This post was last modified on January 15, 2024 4:54 pm
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…