సంక్రాంతి సినిమాల్లో పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో నాగార్జునని మాస్ అవతారంలో చూపించబోతున్న నా సామిరంగ మీద అభిమానులకు పెద్ద అంచనాలే ఉన్నాయి. వేగంగా షూటింగ్ జరుపుకున్నప్పటికీ అవసరమైన బజ్ తేవడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. అయితే విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ట్రైలర్ ఎలా ఉండబోతోందనే దాని మీద రేసులో ఉన్న ఇతర హీరోల అభిమానులూ ఆసక్తిని పెంచుకున్నారు. డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేయబోతున్న నా సామిరంగకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం ఆకర్షణగా నిలవబోతోంది. ఇంతకీ వీడియోలో ఏం చెప్పారు.
ఎక్కడో గోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామం. క్రిష్టయ్య(నాగార్జున)అంటే తప్పుడోళ్లకు దడ. అందరితో కలివిడిగా ఉంటూ ఏదైనా తేడా వస్తే దుమ్ము దుమారం రేపే టైపు. స్నేహితులు అంజి(అల్లరి నరేష్), భాస్కర్(రాజ్ తరుణ్) అంటే ప్రాణం. వరలక్ష్మి(ఆశికా రంగనాథ్)ని ప్రాణంగా ప్రేమిస్తాడు కానీ జీవిత భాగస్వామిని చేసుకోలేకపోతాడు. అయితే జాతర సందర్భంగా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి తీసుకెళ్లే ప్రభల తీర్థం విషయంలో గొడవలు మొదలవుతాయి. అది వస్తే శుభం జరుగుతుందని కిష్టయ్య కావాలని దానికి అడ్డుపడుతున్న దుర్మార్గులను అడ్డు తొలగించేందుకు వెనుకాడడు. అదెలాగో తెరమీద చూడాలి.
చాలా ఏళ్ళ తర్వాత నాగార్జునని ఇంత ఊర మాస్ గా చూడటం అభిమానులకు కనువిందే. అల్లరి నరేష్ టైమింగ్, ఆశికా రంగనాథ్ గ్లామర్ తో పాటు పక్కా పల్లెటూరి నేపథ్యంలో రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ రాసిన డైలాగులు పేలేలా ఉన్నాయి. దర్శకుడు విజయ్ బిన్నీ డెబ్యూలో అనుభవం కనిపిస్తోంది. ‘ఈసారి పండక్కి నా సామిరంగ’ అంటూ ఎంఎం కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మొత్తంగా బిసి సెంటర్లలో మోత మోగించేలా ఉంది. ఓవర్ స్టయిలిష్ యాక్షన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి కమర్షియల్ టర్నింగ్ తీసుకున్న నాగార్జున సామిరంగపై నమ్మకాన్ని అమాంతం పెంచేశాడు.
This post was last modified on January 9, 2024 4:19 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…