నటుడిగా మనకెంత పరిచయమున్నా, దర్శకుడిగా ఉపేంద్రది చాలా విలక్షణమైన శైలి. ఇప్పుడేదో అర్జున్ రెడ్డి, యానిమల్ అంటూ అగ్రెసివ్ హీరోయిజం గురించి చెప్పుకుంటున్నాం కానీ మూడు దశాబ్దాల క్రితమే A రూపంలో అంతకు మించిన షాకింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను నివ్వెరపరిచిన ప్రతిభ ఆయనది. స్వంత పేరునే టైటిల్ గా పెట్టుకుని బ్లాక్ బస్టర్ సాధించిన ఘనత కూడా తనకే దక్కుతుంది. హీరోగా బిజీగా అయ్యాక డైరెక్షన్ తగ్గించిన ఉప్పి దాదా త్వరలో UI తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెరైటీ ప్రమోషన్లతో ఆకట్టుకుంటున్న ఈ సినిమా టీజర్ ని ఇవాళ లాంచ్ చేశారు.
అదో కొత్త ప్రపంచం. ఎక్కడో సుదూర తీరాన జపాన్, చైనా లాంటి దేశాలను దాటి ప్రయాణిస్తే తప్ప అక్కడికి చేరుకోలేం. మనుషులు విచిత్రంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ వేషభాషలు వెరైటీగా ఉంటాయి. రాగద్వేషాలు, పగలు ప్రతీకారాలు, ఆధిపత్య పోరులు అన్నీ కనిపిస్తాయి. శరణు కోసం వేడుకునే దీనులు ఉంటారు. తమను ఎవరో కాపాడతారని ఎదురు చూస్తున్న సమయంలో దున్నపోతు లాంటి జంతువును వాహనంగా చేసుకుని వస్తాడో వ్యక్తి(ఉపేంద్ర). క్రూరమైన చూపులు, ఆహార్యంతో ఉండే ఇతని ఆగమనం ఎందుకు, ఎలా జరిగిందనే ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి.
ఊహించినట్టే విజువల్స్, టేకింగ్ డిఫరెంట్ గా ఉన్నాయి. డీ కోడ్ చేయడం వల్ల పైన చెప్పిన స్టోరీ ఆ మాత్రం వచ్చింది కానీ సగటు ప్రేక్షకులకు పజిల్ అనిపించే ఎన్నో ప్రశ్నలు రెండు నిమిషాల వీడియోలో పొందుపరిచారు ఉపేంద్ర. విఎఫెక్స్ వర్క్ బాగుంది. కాంతార, విరూపాక్ష, మంగళవారంతో బీజీఎమ్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభిన్నంగా ఉంది. రవి శంకర్, సాధు కోకిల లాంటి ఒకరిద్దరు ఆర్టిస్టులను మాత్రమే రివీల్ చేశారు. హీరోయిన్ ని చూపించలేదు. మళ్ళీ ఏదో డిఫరెన్స్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్న అంచనాలు కలిగించడంలో ఉపేంద్ర సక్సెసయ్యారు.
This post was last modified on January 8, 2024 2:29 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…