కేవలం ఇంకో వారం రోజుల్లో గుంటూరు కారం థియేటర్లలో అడుగు పెట్టనుంది. సెన్సార్ అయిపోయింది. రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నిడివితో ఫైనల్ కట్ లాక్ చేసుకున్నారు. రీ రికార్డింగ్ పనులు పూర్తయ్యాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రైలర్ లాంచ్ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అదిరిపోయే పోస్టర్లు తప్ప ఇప్పటిదాకా సాలిడ్ గా అనిపించే వీడియో కంటెంట్ ఏదీ త్రివిక్రమ్ బృందం వదల్లేదు. అయినా సరే హైప్ కి ఏ మాత్రం కొదవ లేకుండా మహేష్ బాబు మేనేజ్ చేస్తున్నాడు.
తాజా అప్డేట్ ప్రకారం గుంటూరు కారంకి అర్ధరాత్రి ప్రీమియర్లు వేసే దిశగా తీవ్ర సమాలోచనలు జరుగుతున్నాయట. సలార్ లాగే నైజామ్ మిడ్ నైట్ షోలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఆ మేరకు ఎంపిక కొన్ని సింగల్ స్క్రీన్లు, మల్టీప్లెక్సుల్లో ప్రదర్శించేందుకు గల సాధ్యాసాధ్యాలు, ఇబ్బందులు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి ఆట ఏఎంబిలో ఉండొచ్చని తెలిసింది. తెల్లవారుఝామున 4 గంటలకు కన్ఫర్మే కానీ ఒంట గంట వ్యవహారం ఇంకో రెండు మూడు రోజుల్లో తేలనుంది. కథ గురించి ఓ వర్గంలో జరుగుతున్న ప్రచారం పట్ల నాగవంశీ సెటైరిక్ ట్విట్లు వేస్తున్నారు.
ఏది జరిగినా గుంటూరు కారం మొదటి రోజు ర్యాంపేజ్ ఓ రేంజ్ లో ఉండబోతోంది. నైజామ్ లో రికార్డులు బద్దలు కావడం ఖాయమే. టికెట్ రేట్ల పెంపుకు సంబంధించిన జిఓ జనవరి 9 లోపు రావొచ్చని డిస్ట్రిబ్యూటర్లు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి రిలీజులన్నీ హైక్ అడిగే ఆలోచనలో ఉన్నాయి. హనుమాన్, సైంధవ్ రెండూ భారీ బడ్జెట్ చిత్రాలే. నా సామిరంగ అంత ఖర్చు కాకపోయినా నాగార్జున హీరో కాబట్టి పెద్ద సినిమా కిందకే వస్తుంది. జనవరి 11 రాత్రి హనుమాన్ ప్రీమియర్లు వేసే ప్లాన్ లో ఉండగా గుంటూరు కారం తీసుకునే నిర్ణయం బాక్సాఫీస్ ని వాడివేడిగా మార్చబోతోంది.
This post was last modified on January 5, 2024 1:49 pm
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…