సంచలన చిత్రాలతో, అంతకుమించి తన ఐడియాలజీతో కోట్లాదిమందిని ప్రభావితం చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కానీ ఇప్పుడు ఆయన ఓ చెల్లని కాణీ అనడంలో సందేహం లేదు. దర్శకుడిగా వర్మ ఎంత పతనమయ్యాడో అందరికీ తెలిసిందే. ఇక వ్యక్తిగా ఆయన ప్రవర్తన ఎలా ఉంటోందో చూస్తూనే ఉన్నాం. దర్శకుడిగా పూర్తిగా క్రెడిబిలిటీ కోల్పోవడంతో సినిమాల ద్వారా ఆయనకు ఆదాయం దాదాపుగా ఆగిపోయింది.
ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీకి ఆయన ప్రచారకర్తగా మారిపోయాడు. ఆయన పని అంతా వైసీపీ ప్రత్యర్థులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను బద్నాం చేయడమే. ఇందుకోసం తన ట్విట్టర్ అకౌంట్ తో పాటు సినిమాలను ఆయుదంగా వాడుతున్నాడు వర్మ.
అయితే 2019 ఎన్నికలకు ముందు వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి సినిమాలు, ప్రత్యర్థి నాయకులపై ఆయన ట్విట్టర్ కామెంట్లు వైసిపికి బాగానే ఉపయోగపడ్డాయి కానీ.. ఇప్పుడు వర్మ వల్ల ఎలాంటి ప్రయోజనం ఆ పార్టీకి దక్కుతున్న సంకేతాలు కనిపించడం లేదు. సోషల్ మీడియాలో వర్మను పట్టించుకునే నాధుడే కనిపించడం లేదు. ఇంతకుముందు ఆయనతో కయ్యం పెట్టుకుని బాగా ఎంటర్టైన్ చేసిన టిడిపి, జనసేన కార్యకర్తలు పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నారు. అవతలి వాళ్ళని గిచ్చి తన పబ్బం గడుపుకొనే వర్మకు ఇది పెద్ద శిక్షే. వర్మకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారన్నమాట కానీ ఆయన పోస్టుల వల్ల వైసీపీకి ఏమాత్రం ప్రయోజనం దక్కుతోందన్నది ప్రశ్నార్థకమే.
ఇక వైసీపీ ఫండింగ్ తో వర్మ తీసిన వ్యూహం, శపథం సినిమాలు అసలు విడుదలకు నోచుకుంటాయా అన్నదే సందేహంగా మారింది. ఆల్రెడీ వ్యూహం చిత్రానికి బ్రేక్ పడింది. ఇది రాలేదంటే శపథం కూడా విడుదల కావడం కష్టమే. మరి ఈ చిత్రాల మీద పెట్టిన పెట్టుబడి అంతా వృథా అన్నట్లే. డబ్బులు పోయాయి, పైగా ప్రత్యర్థులకు జరగాల్సిన డ్యామేజ్ జరగలేదు. మొత్తంగా వర్మ మీద వైసిపి పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం వేస్ట్ అవుతున్నట్లే కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates