సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది మృణాల్ ఠాకూర్. ఆ చిత్రంలో సీత పాత్రలో తనను తప్ప ఇంకొకరిని ఊహించుకోలేని పెర్ఫార్మన్స్ ఇచ్చిందామె. అందం, అభినయం రెండింటితోను కట్టిపడేసి తెలుగు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసింది మృణాల్. ఆ సినిమా తర్వాత కూడా ఆమెకు తెలుగులో మంచి మంచి అవకాశాలే వస్తున్నాయి.
ఇప్పటికే హాయ్ నాన్నతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో కూడా ఆమెనే కథానాయకగా అనుకుంటున్నాట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఇలా క్రేజీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న మృణాల్.. తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఆమె నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ సరసన సినిమా చేయబోతుందట. అది కూడా ఒకటి కాదు రెండు సినిమాల్లోనట.
ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న అయలాన్ సినిమాను రూపొందించిన రవికుమార్ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ చిత్రానికి మృణాల్ కథనాయకగా ఎంపికైనట్లు తాజా సమాచారం. ఈ సినిమాకు మృణాల్ సంతకం కూడా చేసేసిందట. అంతేకాక లారెన్స్ నటించనున్న మరో సినిమాకు కూడా మృణాల్ ను కథానాయికగా పరిశీలిస్తున్నారట. ఆ చిత్రాన్ని రమేష్ వర్మ రూపొందించబోతున్నాడు. అయితే లారెన్స్ సరసన మృణాల్ అనే వార్తను సోషల్ మీడియా జనాలు చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.
వీళ్ళిద్దరికీ అసలు జోడి ఎలా కుదురుతుంది అని ప్రశ్నిస్తున్నారు. అది కూడా రెండు సినిమాల్లో లారెన్స్ సరసన నటించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. తెలుగులో ఇంత మంచి కెరీర్ ఉండగా.. తమిళంలో లారెన్స్ కు జోడిగా నటించాల్సిన అవసరం ఏంటి అని మృణాల్ ను అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తమిళంలోకి వెళ్తే ఎవరైనా పెద్ద హీరోతో సినిమా చేస్తే బాగుండేదని అంటున్నారు. మరి మృణాల్- లారెన్స్ జోడి గురించి వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. అది మ్యాటర్ సంగీతం
This post was last modified on January 3, 2024 12:01 am
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చేసిన సూచన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉద్యోగం…
ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ…
రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా మొబైల్ స్క్రీన్…
సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…