హనుమాన్ సిరీస్ లో 11 సినిమాలు

దర్శకుడు ప్రశాంత్ వర్మ కాన్ఫిడెన్స్ అంతా ఇంతా కాదు. విపరీతమైన ఒత్తిడి ఉందని, సెన్సార్ కు సైతం అడ్డుపడుతున్నారని చెబుతూనే జనవరి 12 విడుదల తేదీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో హనుమాన్ ని తప్పించేందుకు ఇష్టడటం లేదు. మిగిలిన నాలుగు సినిమాలతో ఢీ కొట్టేందుకే నిర్మాతలతో కలిసి రెడీ అయ్యాడు. అయితే తన సినిమాటిక్ యునివర్స్ లో ఇది కేవలం మొదటి భాగమే అంటున్నాడు. మొత్తం 12 సినిమాలు ఉంటాయని, నెక్స్ట్ అధీరాతో ఇది కొనసాగుతుందని, మూడోది ఫిమేల్ ఓరియెంటెడ్ గా సాగుతూనే ఫాంటసీ బ్యాక్ డ్రాప్ ని కొనసాగిస్తానని చెబుతున్నాడు. ప్లాన్స్ గట్టిగానే ఉన్నాయి.

ఇది కార్యరూపం దాల్చాలంటే హనుమాన్ బ్లాక్ బస్టర్ కి తక్కువగా ఆడకూడదు. డిస్ట్రిబ్యూషన్ పరంగా మైత్రి అండ దొరికింది కానీ గుంటూరు కారంతో పాటు వెంకటేష్, రవితేజ, నాగార్జునలను కాచుకోవడం అంత సులభంగా ఉండదు. టాక్ బాగా రావడం ఒక ఎత్తయితే వాటిని కలెక్షన్లుగా మార్చుకోవడం మరో సవాల్. హనుమంతుడి సెంటిమెంట్ తో పాటు జనాల్లో క్రమంగా పెరుగుతున్న అయోధ్య శ్రీరామ ఆలయ ప్రారంభం తాలూకు ఆధ్యాత్మిక చింతన ఖచ్చితంగా వసూళ్లను తెస్తుందని నమ్ముతున్నారు. ఈ లెక్కలు ఎలా ఉన్నా ఫైనల్ గా మాట్లాడాల్సింది తెరమీద కనిపించే అవుట్ ఫుట్.  

క్యాస్టింగ్ పరంగా చిన్న సినిమా కాబట్టి ప్రశాంత్ వర్మ సింపతీ కార్డు ప్లే చేస్తున్నాడనే కామెంట్స్ ఇండస్ట్రీలోనే వినిపిస్తున్నాయి. అయినా సానుభూతి మీద ఆడియన్స్ టికెట్లు కొనరు కాబట్టి చివరిగా సినిమా ఎలా వచ్చిందనేది ముఖ్యం. సరిపడా స్క్రీన్లు సమకూర్చుకునే పనిలో హనుమాన్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ ఎండ్ లో గీతా ఆర్ట్స్ మద్దతు కూడా ఉందని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. రెండు బడా సంస్థలు తోడుగా ఉంటే పంపిణి సాఫీగా జరుగుతుంది. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన హనుమాన్ సెలబ్రిటీల మద్దతు తీసుకునేందుకు ప్రశాంత్ వర్మ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు.