మెగాస్టార్ చిరంజీవి చిన్న సినిమాలకు అండగా నిలవడం కొత్తేమీ కాదు. ప్రమోషనల్ బైట్స్ ఇవ్వడం, ప్రి రిలీజ్ ఈవెంట్లలో పాల్గొనడం, వాయిస్ ఓవర్లు ఇవ్వడం.. ఇలా చాలా సాయాలే చేస్తుంటారు చిరంజీవి. ఇక మెగాస్టార్ రెఫరెన్సులను వాడుకునే వాళ్ళు అయితే లెక్కేలేదు. ఇప్పుడు ఓ చిత్ర బృందం మెగాస్టార్ ను కాస్త భిన్నమైన తీరులో ఉపయోగించుకోబోతుంది.
సంక్రాంతికి విడుదల కాబోతున్న హనుమాన్ చిత్రంలో చిరును చూడబోతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ పరోక్షంగా ఈ మేరకు హింట్ ఇచ్చాడు. ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రను గ్రాఫిక్ రూపంలో చూడబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ లుక్ పూర్తి స్థాయిలో రిలీజ్ చేయలేదు.
హనుమాన్ ట్రైలర్లో కేవలం హనుమంతుడి కళ్ళ వరకే చూపించారు. అయితే ఆ కళ్ళు చూసిన చాలామందికి చిరునే గుర్తుకొచ్చాడు. దీంతో సినిమాలో హనుమంతుడి రూపం చిరును పోలినట్లే ఉంటుందా అన్న ఆసక్తి కలిగింది. ఈ విషయమై ప్రశాంత్ వర్మను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. ఆ సంగతి సస్పెన్స్ అని చెప్పాడు. హనుమంతుడి పాత్ర ఎవరు పోషించారో, ఆ రూపం ఎలా ఉంటుందో తెరమీద చూసి తెలుసుకోవాలి అన్నాడు.
హనుమంతుడిని చిరులా చూపించాలా అనే విషయమై తమ టీంలో కొన్ని రోజులు జరిగిందని.. అయితే తామేం చేశాము అనే విషయం సస్పెన్స్ అని, అదేంటో స్క్రీన్ మీదే చూడాలని.. ప్రేక్షకులు కచ్చితంగా సర్ప్రైజ్ అవుతారని అతను చెప్పాడు. తన మాటలను బట్టి చూస్తుంటే హనుమాన్ సినిమాలో చిరు రూపంలోనే హనుమంతుడి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరు హనుమ భక్తుడే కాబట్టి తనను ఆ రూపంలో చూపిస్తాం అని హనుమాన్ టీమ్ అడిగితే సంతోషంగా ఒప్పుకునే ఉంటాడు.
This post was last modified on December 31, 2023 1:27 am
వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, ఇది…
తండేల్ ప్రమోషన్లలో భాగంగా అల్లు అరవింద్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మగధీర తన మేనల్లుడు రామ్ చరణ్ కు ఎలాగైనా…
రైల్వేలలో కొత్త జోన్ కోసం జరిగిన ప్రయత్నాలు.. ఒత్తిళ్లు ఎట్టకేలకు ఫలించాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖ కేంద్రంగా జోన్…
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ప్రత్యేక…
ఆస్ట్రేలియా జట్టు ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో స్ట్రాంగ్ టీమ్ గా రాబోతోంది అనుకుంటున్న టైమ్ లో ఊహించని పరిణామాలు…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…