అల్లు అర్జున్ ప్రతి విషయంలోను పకడ్బందీ ప్రణాళికతో వుంటాడు. మాస్ సినిమాలు అతిగా చేస్తే సమస్య అవుతుందని బన్నీ ముందుగా గుర్తించి వాటిని వీలయినంత తక్కువ సంఖ్యలో చేసాడు. రామ్ చరణ్‌కి నాలుగైదు సార్లు చేతులు కాలితే కానీ మూస సినిమాలు ప్రమాదమని అర్థం కాలేదు. అలాగే డైరెక్టర్ల వెంటపడి మరీ అల్లు అర్జున్ తనతో సినిమాలు ఓకే చేయించుకుంటూ వుంటాడు. కానీ చరణ్ అలా చొరవగా ముందుకెళ్లి డైరెక్టర్లను లాక్ చేయడు.
ఇంతవరకు త్రివిక్రమ్‌తో కానీ, కొరటాల శివతో కానీ చరణ్ ఒక్క సినిమా కూడా చేయకపోవడమే అందుకు నిదర్శనం. ఇక ఇతర విషయాలలోను బన్నీ ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతుంటాడు. పవన్ ఫాన్స్ మరణ వార్తకు స్పందించి బన్నీ ముందుగా విరాళం ప్రకటించాడు. అతనికి ఆ ఐడియా వచ్చిన తర్వాత చరణ్ కూడా ముందుకొచ్చాడు. ఇందులో ఇమేజ్ పరంగా నష్టమేమీ లేదు కానీ ఫాస్ట్‌గా రియాక్ట్ అవడం, దర్శకులను ముందుగా లాక్ చేయడం కూడా ఈ పోటీ వాతావరణంలో చాలా కీలకం.
కొరటాల శివతో సినిమా చేసే అవకాశం ఏనాడో వస్తే అప్పుడు అది వదిలేసి కృష్ణవంశీ సినిమా చేసాడు. తర్వాత కూడా కొరటాలతో సినిమా చేయడానికి తనంతట తానుగా ముందుకెళ్లకుండా తాత్సారం చేసాడు. ఆర్.ఆర్.ఆర్. తర్వాతి సినిమా కొరటాలతో లాక్ చేసుకునే వీలున్నా అంత ప్రెజర్ పెట్టలేదు. ఈలోగా అల్లు అర్జున్ అతనితో సినిమా ఖాయం చేసుకున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates