ఈసారి ఆస్కార్ రేస్ నుంచి ముందే..

ఆస్కార్ అవార్డు కోసం ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో మన సినిమాను నామినేట్ చేయడం.. అది షార్ట్ లిస్ట్ కాకుండానే వెనక్కి వచ్చేయడం మనకి కొత్త ఏం కాదు. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నది. గత ఏడాది కూడా ఆర్ఆర్ఆర్ ను కాదని ఒక గుజరాతి చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్ కోసం పంపితే అది ముందే డ్రాప్ అయిపోయింది. అయితే ఆర్ఆర్ఆర్ ను సొంతంగా పోటీలో నిలిపిన చిత్ర బృందం రెండు పురస్కారాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా ప్రభుత్వం తరఫున ఆస్కార్ బరిలో నిలిచిన 2018 సినిమా విదేశీ చిత్రం కేటగిరిలో షార్ట్ లిస్ట్ కాలేకపోయింది. ఈ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్. ఆస్కార్ పోటీ నుంచి అధికారికంగా తప్పుకుంది.

2018 గత ఏడాది చిత్రం మే 2023 లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే పలు అవార్డులను అందుకుంది. దీంతో ఇండియా తరపున ఈ చిత్రన్ని 96 వ అకాడెమీ అవార్డుల కోసం ప్రభుత్వం పంపింది. కానీ ఈ సినిమా అకాడమీ వాళ్ళను మెప్పించలేక తొలి దశలోనే వెనుదిరిగింది. గత ఏడాది ఇండియాలో బిగ్గెస్ట్ సీట్లలో 2018 ఒకటి. మలయాళం లో 100 కోట్లకు పైగా ఈ సినిమా గ్రాస్ వస్తువులను రాబట్టింది.

కేరళను ముంచెత్తిన భారీ వరదల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రియలిస్టిక్ గా చిత్రీకరించారు. ప్రేక్షకులకు నిజంగా వరదల్లో ఉన్న ఫీలింగ్ కలిగిస్తూ ఈ చిత్రం థ్రిల్ చేయడమే కాక భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లింది. 2018 తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. ఈ సర్వైవల్ థ్రిల్లర్లో లాల్, నరేన్, అపర్ణ బాలమురళి, కలై అరసన్, అజు వర్గీస్, వినీత్ శ్రీనివాసన్, కుంచుకో బోబన్ కీలక పాత్రల్లో నటించారు. జేడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వేణు కున్నప్పిల్లి, సీకే పద్మ కుమార్, ఆంటోనీ జోసెఫ్ నిర్మించారు.