సందీప్ కిషన్ హీరోగా రూపొందిన ఊరి పేరు భైరవకోన ఎట్టకేలకు విడుదల తేదీని లాక్ చేసుకుంది. 2024 ఫిబ్రవరి 9న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే అదే డేట్ ని టిల్లు స్క్వేర్ గతంలోనే లాక్ చేసుకుంది. కానీ భైరవకోనకు వచ్చిన రిస్క్ ఏం లేదనే చెప్పాలి. ఎందుకంటే రెండు వేర్వేరు జానర్లు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఒకటైతే మరొకటి హారర్ కం థ్రిల్లర్ బాపతు. సో కంటెంట్లు బాగుంటే ఆదరణ విషయంలో అనుమానపడటానికి లేదు. పైగా విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2 విజయాలు సందీప్ మూవీకి బూస్ట్ అయ్యాయి.
ఎలా చూసుకున్నా సిద్దు జొన్నలగడ్డ, సందీప్ కిషన్ లు పరస్పరం తలపడటం వల్ల ఎలాంటి ఇబ్బంది తలెత్తదు. పైగా సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా తగ్గిపోయి, రిపబ్లిక్ డేకి వచ్చిన ఫైటర్, లాల్ సలాం లాంటివి అప్పటికే నెమ్మదిస్తాయి కాబట్టి ఓపెన్ గ్రౌండ్ దొరుకుతుంది. టిల్లు స్క్వేర్ నెలల తరబడి పలు రిపేర్లు చేసుకుని పర్ఫెక్షన్ కోసం వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. కాకతాళీయంగా ఫస్ట్ పార్ట్ వచ్చిన ఫిబ్రవరి నెలనే సీక్వెల్ కి దొరకడం సెంటిమెంట్ గా చెప్పొచ్చు. ఇక ఊరి పేరు భైరవకోనకు నిర్మాత అనిల్ సుంకర అండ నెట్వర్క్ పరంగా చాలా ప్లస్ కానుంది.
ఎక్కడికి పోతావు చిన్నవాడా, టైగర్, ఒక్క క్షణం లాంటి విభిన్న చిత్రాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు విఐ ఆనంద్ కు డిస్కో రాజా చేదు అనుభవం మిగిల్చినా భైరవకోనతో మళ్ళీ కంబ్యాక్ అవుతాననే నమ్మకం బలంగా చూపిస్తున్నారు. మార్చిలో డబుల్ ఇస్మార్ట్, గ్యాంగ్స్ అఫ్ గోదావరి లాంటి మీడియం రేంజ్ భారీ సినిమాలు ఉండటంతో ఫిబ్రవరినే బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా ఆల్రెడీ రెండు పాటలు జనంలోకి బాగానే వెళ్లాయి. పెద్ద స్టార్లు ఢీ కొట్టుకోవడం సహజమే కానీ ఇలా చిన్న హీరోలు బాక్సాఫీస్ దగ్గర తలపడటం ఆసక్తికరంగా ఉంటుంది.
This post was last modified on December 21, 2023 7:16 pm
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…
తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ఫౌజీ టైటిల్…