Movie News

హమ్మయ్య.. సినీ జనాల కడుపులు నిండుతున్నాయ్

అన్ని రంగాల్లోనే సినిమా ఫీల్డు కూడా కరోనా ధాటికి కుదేలైంది. ఆరు నెలలుగా సినీ కార్యకలాపాలన్నీ ఆగిపోయి ఉన్నాయి. షూటింగ్‌‌లు జరగట్లేదు. సినిమాల పోస్ట్ ప్రొడక్షన్లు నడవట్లేదు. థియేటర్లు మూతపడి ఉన్నాయి. దీంతో సినిమాను నమ్ముకున్న వేలాది కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. జూనియర్ ఆర్టిస్లుల దగ్గర్నుంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ ఇబ్బంది పడ్డవాళ్లే.

ఇంతకుముందు కొంచెం ఖరీదైన జీవితం గడిపిన వాళ్లు కూడా లాక్ డౌన్ టైంలో కష్టాలు ఎదుర్కొన్నారు. ఇక కింది స్థాయి వాళ్ల పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సీసీసీ ద్వారా కొంత సాయం అందింది కానీ.. వాటితో అన్ని అవసరాలూ తీరలేదు. ఆ సాయం తీసుకోవడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చి ఆగిపోయిన వాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్లంతా సినిమాల షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని చూశారు.

రెండు నెలల కిందటే షూటింగులకు అనుమతులు వచ్చినప్పటికీ కరోనా విలయం చూసి హీరోలు, దర్శకులు, నిర్మాతలు షూటింగ్‌కు ముందుకు రాలేదు. ఐతే ఇప్పుడు ఉద్ధృతి కొంచెం తగ్గడం, భయం కూడా తగ్గడంతో ఇంకెంతో కాలం షూటింగ్‌లు ఆపొద్దని ఇండస్ట్రీ జనాలు నిర్ణయించుకున్నారు. సెప్టెంబరు రెండో వారంలో ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడం ఆలస్యం.. మిగతా చిత్రాల బృందాల్లోనూ కదలిక వచ్చింది.

దాని కంటే ముందే కొన్ని సినిమాలు మళ్లీ సెట్స్ మీదికి వెళ్లిపోయాయి. అందులో సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం ఒకటి. అలాగే అక్కినేని నాగార్జున సినిమా ‘వైల్డ్ డాగ్’ షూటింగ్‌ను కూడా సైలెంటుగా పున:ప్రారంభించినట్లు తెలుస్తోంది. యువ కథానాయకుడు సందీప్ కిషన్ కూడా ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రీకరణ మొదలుపెట్టేశాడు. చిరంజీవి, బాలయ్య సైతం మళ్లీ షూటింగ్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చిత్రాల బృందాలు ఈ వారంలో షూటింగ్ పున:ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. దీంతో ఇండస్ట్రీ మళ్లీ ఫుల్ స్పీడ్ అందుకోబోతున్నట్లే. సినీ జనాల కడుపులు నిండబోతున్నట్లే.

This post was last modified on September 2, 2020 12:19 pm

Share

Recent Posts

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

15 minutes ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

4 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

5 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

6 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

6 hours ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

7 hours ago