కరోనా తగ్గే వరకు సినిమా షూటింగ్సే వద్దనుకున్న తెలుగు సినిమా వాళ్లు ఇప్పుడు వరుసగా చాలా సినిమాలను తిరిగి మొదలు పెట్టేసారు. ముఖ్యంగా నిర్మాణ దశ చివర్లో వున్న సినిమాలను వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇందుకు కారణం ఓటిటిల నుంచి వస్తోన్న మెగా డీల్స్ సొంతం చేసుకోవడమేనని అర్థమవుతోంది. వి చిత్రానికి ముప్పయ్ కోట్లకు పైగా అమెజాన్ చెల్లించడంతో ఇంతకాలం ‘ఓటిటిల నుంచి ఎంత వస్తుందిలే’ అని లైట్ తీసుకున్న వారిని పరుగులు పెట్టిస్తోంది. హీరో రేంజ్, మార్కెట్ దృష్టిలో వుంచుకుని ఓటిటి సంస్థలు అమౌంట్ కోట్ చేస్తున్నాయి. థియేటర్ల నుంచి ఎంతయితే వస్తుందో అంత ఓటిటిలు ఇస్తామని ముందుకు రావడంతో నిర్మాతలు చలాకీగా పనులు మొదలు పెట్టేసారు.
కరోనా టైమ్‍లో షూటింగ్ వ్యయం మామూలుగా కంటే అధికమయినా కానీ ఆరు నెలలుగా ఆపుకుని కూర్చున్న సినిమాలను అమ్మేసే అవకాశాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు. విశేషం ఏమిటంటే ఇప్పుడు తమ సినిమాలు థియేటర్లలో విడుదల కాకపోయినా ఫర్వాలేదని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ విపత్తులో సినిమా రిలీజయ్యి, వసూళ్లు రాకపోతే బయ్యర్ల గోల ఎక్కువగా వుంటుంది. అదే ఓటిటిలు అయితే ఒకేసారి అమ్మేసుకుని హ్యాపీగా గుండెల మీద చెయ్యేసుకుని పడుకోవచ్చు.
This post was last modified on September 2, 2020 1:23 am
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…