అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత ఏకంగా నాలుగేళ్లు గ్యాప్ వచ్చేసిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్యలో రచయితగా సహ నిర్మాతగా పవన్ కళ్యాణ్ సినిమాలు, సితార బ్యానర్ వ్యవహారాలతో బిజీగా ఉన్నాడు. అందుకే గుంటూరు కారంతో తన స్టామినా రెట్టింపయ్యిందని ఋజువు చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. షూటింగ్ మొదలుపెట్టిన టైంలో వచ్చిన అవాంతరాలు, హీరోయిన్ మార్పు, మహేష్ కుటుంబంలో విషాదాలు, ఫైట్ మాస్టర్ల ఛేంజ్ ఒకటేమిటి కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్టు గుంటూరు కారం ఆలస్యం కూడా అంతుచిక్కని రీతిలో జరిగింది.
సరే ఇప్పుడదంతా గతం. ఇంకో నెల రోజుల్లో మహేష్ త్రివిక్రమ్ మాస్ చూడబోతున్నాం. తర్వాత అల్లు అర్జున్ కి మాటల మాంత్రికుడు ఒక ప్యాన్ ఇండియా మూవీ లాక్ చేసిన సంగతి తెలిసిందే. మొదటిసారి ఫాంటసీ జానర్ ని టచ్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే పుష్ప 2 రిలీజైతే తప్ప బన్నీ ఫ్రీ అవ్వడు. అప్పటిదాకా ఖాళీగా ఉండటం ఎందుకనే ఉద్దేశంతో ఈలోగా న్యాచురల్ స్టార్ నానితో త్రివిక్రమ్ ఒక మీడియం బడ్జెట్ మూవీని ప్లాన్ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. నిర్ధారణగా ఎలాంటి డీటెయిల్స్ చెప్పలేదు కానీ అంతర్గత సమాచారం మేరకు సాధ్యమయ్యే సూచనలు లేకపోలేదు.
ఇదే జరిగితే మాత్రం కారం తర్వాత మంచి స్వీట్ తిన్నట్టు అవుతుంది. గతంలో నితిన్ తో అఆ లాంటి సాఫ్ట్ ఎంటర్ టైనర్ తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన త్రివిక్రమ్ నానికి కూడా అలాంటి సెటప్ నే రాసుకుంటారు. గురుజీ పంచులకు నాని టైమింగ్ తోడైతే తెరమీద రచ్చ మాములుగా ఉండదు. అఫీషియల్ గా చెప్పే దాకా వెయిట్ చేయాలి కానీ న్యూస్ మాత్రం స్పెషల్ గా అనిపిస్తోంది. ప్రస్తుతం హాయ్ నాన్న ప్రమోషన్ కోసం యుఎస్ లో ఉన్న నాని తిరిగి రాగానే సరిపోదా శనివారం షూటింగ్ లో పాల్గొంటాడు. త్రివిక్రమ్ తో ప్రాజెక్టు నిజంగా ఉంటుందా లేక గాలి వార్తా అనేది ఫిబ్రవరిలో తేలిపోతుంది.
This post was last modified on December 13, 2023 3:24 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…