Movie News

మహేష్ ములాఖాత్ తర్వాత ఎవరు

నెట్ ఫ్లిక్స్ సిఈఓ టెడ్ సరండోస్ హైదరాబాద్ వచ్చి నాన్ స్టాప్ గా తెలుగు స్టార్ హీరోలను కలుసుకోవడం, వాటి తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, వీటి మీద పెద్ద చర్చే జరుగుతోంది. అయినా ముంబై వెళ్లి షారుఖ్ ఖాన్, సల్మాన్, అమీర్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ప్రత్యేకంగా టాలీవుడ్ స్టార్స్ తో మీటింగులు పెట్టుకోవడం ఆసక్తి రేపుతోంది. ముందు చిరంజీవి, రామ్ చరణ్ అండ్ కోతో అయ్యింది. ఆ తర్వాత మరుసటి రోజే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ను కలుసుకున్నారు. ఇరవై గంటలు గడిచే లోపే కాఫీ తాగుతూ మహేష్ బాబు ఇంటికెళ్లి స్టిల్స్ ఇచ్చేశారు.

నెక్స్ట్ లిస్టులో ఎవరున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం తర్వాత జాబితాలో అల్లు అర్జున్, ప్రభాస్ లు ఉన్నారు. బన్నీ అందుబాటులోనే ఉన్నాడు కానీ డార్లింగ్ గత ఇరవై రోజులకు పైగానే బయటికి రావడం లేదు. ఇక అక్కినేని ఫ్యామిలీని, దగ్గుబాటి హీరోలను కలుసుకునే అవకాశం ఉంది. రానా నాయుడు స్టార్స్ వెంకటేష్, రానాలు అభిరాం పెళ్లి వేడుకని విదేశాల్లో పూర్తి చేసుకుని భాగ్యనగరానికి వచ్చేశారు కాబట్టి ఈ కలయికని చూడొచ్చు. తమ ఓటిటిలో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరోలతో వరసబెట్టి మరీ అప్పొయింట్ మెంట్స్ తీసుకుంటున్నాడు టెడ్.

ఆయన ఉద్దేశం ఏమైనా ఫ్యాన్స్ మాత్రం ఈ మీటింగులు చూసి తెగ సంబరపడుతున్నారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ డిజిటల్ హెడ్ వచ్చి అదే పనిగా తమ హీరోలను కలుసుకుని ఫోటోలు సెల్ఫీలు పెట్టడం కన్నా కావాల్సింది ఏముంటుంది. ఇంతకీ టెడ్ ఏదో పెద్ద ప్లానింగ్ తోనే ఇండియాలో ఉన్నాడు. ఊరికే పిక్స్ తీసుకోవడానికి వచ్చేంత ఖాళీగా ఉండరు కాబట్టి ఏదో ప్రణాళిక ఉండే ఉంటుంది. మన దేశంలో కార్యకలాపాలను విస్తరించే పనిలో ఉన్న నెట్ ఫ్లిక్స్ కి ఇప్పుడీ సమావేశాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అందులోనూ టెడ్ ప్రత్యేకంగా టాలీవుడ్ కి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం స్పెషల్ గా అనిపిస్తోంది.

This post was last modified on December 9, 2023 10:58 am

Share

Recent Posts

అమితాబ్ టెక్నిక్ ఫాలో అయితే… మీ స‌తీమ‌ణి టైమ్‌కి రెడీ!

ఏదైనా పెళ్లో.. మ‌రో ఫంక్ష‌నో.. భార్యా భ‌ర్త‌లు ఇరువురు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు.. స‌హ‌జంగా దంప‌తుల్లో ఉత్సాహం ఉంటుంది. భ‌ర్త ముందుగానే…

47 minutes ago

లెక్క తప్పుతున్న యూత్ సినిమాలు

యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…

2 hours ago

నిన్న సందీప్ వంగ… నేడు శ్రీకాంత్ ఓదెల

మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…

2 hours ago

దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…

3 hours ago

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

8 hours ago