నందమూరి బాలకృష్ణ.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఏమాత్రం పొంతన కుదరని కాంబినేషన్ ఇది. బాలయ్య అంటే ఊర మాస్.. త్రివిక్రమ్ అంటే క్లాస్.. ఈ కలయికలో సినిమా వస్తుందని ఎవరూ ఊహించరు. ఇప్పటిదాకా అలాంటి ప్రయత్నం ఏదీ జరగలేదు. ఇకముందు కూడా జరుగుతుందనే అంచనాలు లేవు. ఐతే త్రివిక్రమ్.. బాలయ్యను డైరెక్ట్ చేయట్లేదు కానీ.. ఆయనతో చేతులు కలుపుతున్నాడు.
‘భగవంత్ కేసరి’ తర్వాత బాలయ్య.. బాబీ దర్శకత్వంలో నటించనున్న సినిమాలో త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి త్రివిక్రమ్ సంస్థ ఫార్చ్యూన్ ఫోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారా బాలయ్యతో ఏర్పడిన అనుబంధంతో ఆయన కొడుకు అరంగేట్ర చిత్రం కోసం త్రివిక్రమ్ సాయం పట్టడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ అరంగేట్రానికి సమయం దగ్గర పడ్డట్లే కనిపిస్తోంది. వచ్చే ఏడాది మోసజ్ఞ ఎంట్రీ ఇస్తాడని బాలయ్య ఇప్పటికే ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కోసం కథ వేట ముమ్మరంగా సాగుతోంది. ఇందుకోసం అనిల్ రావిపూడి సహా కొందరు స్టార్ దర్శకుల సాయం తీసుకుంటున్నాడట బాలయ్య. అందరి సలహాలు సూచనల ఆధారంగా ఒక మంచి కథను రెడీ చేసి.. మోక్షజ్ఞను తెరపైకి తీసుకురావాలని బాలయ్య ప్రయత్నిస్తున్నాడట. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ తో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
మోక్షజ్ఞ కోసం త్రివిక్రమ్ పూర్తిగా కథ అందిస్తారని చెప్పలేం కానీ మంచి ఇన్ పుట్స్ ఇచ్చి కథ రెడీ చేయించే అవకాశాలను కొట్టి పారేయలేం. ఇదే నిజమైతే త్రివిక్రమ్ లాంటి అనుభవజ్ఞుడైన రచయిత, దర్శకుడి టచ్ మోక్షజ్ఞ ఎంట్రీకి ఎంతగానో ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.
This post was last modified on December 5, 2023 10:49 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…