గత నెల నవంబర్ 24న విడుదల కావాల్సిన కళ్యాణ్ రామ్ ప్యాన్ ఇండియా మూవీ డెవిల్ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడటం తెలిసిన విషయమే. సినిమా మొదలయ్యేనాటికి ఉన్న దర్శకుడు నవీన్ మేడారం తర్వాత తప్పుకోవడం, చివరికి నిర్మాత అభిషేక్ నామానే డైరెక్టర్ గా కార్డు వేసుకోవడం కొద్దిరోజులు పెద్ద చర్చకే దారి తీసింది. వ్యవహారం కోర్టుకు వెళ్లొచ్చని ఫిలిం నగర్ టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో ఇప్పుడే చెప్పలేం. ఇక రిలీజ్ డేట్ విషయంలో క్రమంగా ఒక క్లారిటీ వస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. డిసెంబర్ 29 తేదీని సీరియస్ గా పరిశీలిస్తున్నారని వినికిడి.
ఇక్కడ కొన్ని గమనించాల్సిన విషయాలున్నాయి. సలార్, డంకీలు వచ్చిన రెండో వారానికే రిస్క్ అవుతుందని చాలా మంది నిర్మాతలు ఆ డేట్ ని వదిలేశారు. అయితే ఏదైతే అదయ్యిందని సుమ కొడుకు రోషన్ కనకాల డెబ్యూ మూవీ బబుల్ గమ్ ని 29కి ఫిక్స్ చేసి ఆ మేరకు ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. ఇది పెద్దగా పరిగణించాల్సిన పోటీ కాదు. ప్రభాస్, షారుఖ్ ఇద్దరిలో ఒకరే విజేతగా నిలుస్తారనే అంచనాలు బలంగా ఉన్నాయి. అదే నిజమైతే ఆ తర్వాత వచ్చే శుక్రవారానికి మరొకరు నిక్షేపంగా రావొచ్చు. డెవిల్ కనక ఈ ఛాన్స్ వాడుకుంటే కాంపిటీషన్ లేకుండా జనవరి 12 దాకా నాన్ స్టాప్ రన్ దక్కుతుంది.
సో ఏ డెసిషన్ తీసుకున్నా ఇంకో రెండు మూడు రోజుల్లో జరిగిపోవాలి. ప్రమోషన్లకు సరిపడా టైం ప్లాన్ చేసుకోవాలి. అమిగోస్ తర్వాత కళ్యాణ్ రామ్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు వదిలేస్తే ఫిబ్రవరి దాకా స్లాట్ దొరకదు. ఆ నెల బాక్సాఫీస్ డ్రైగా ఉంటుంది. మళ్ళీ మార్చ్ లో గ్యాంగ్స్ అఫ్ గోదావరి, డబుల్ ఇస్మార్ట్, ఫ్యామిలీ స్టార్ ఇలా పెద్ద హడావిడి ఉంది. ఆపై ఏప్రిల్ లో దేవరతో రచ్చ నెక్స్ట్ లెవెల్ లో మొదలవుతుంది. పైగా తమ్ముడి సినిమా. సో డెవిల్ చాలా స్ట్రాటెజిక్ గా ఆలోచించడం అవసరం. యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం దీనికి ప్రధాన ఆకర్షణ.
This post was last modified on December 5, 2023 10:54 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…