Movie News

హైద‌రాబాద్‌లో ఐమాక్స్… ఒక‌టి కాదు


దేశంలో అత్య‌ధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. గ‌తంలో కొంత కాలం ప్ర‌సాద్స్ మ‌ల్టీప్లెక్స్‌లో ఐమాక్స్ స్క్రీన్ న‌డిచినా.. త‌ర్వాత ఐమాక్స్ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయి, దాన్ని పీసీఎక్స్ స్క్రీన్‌గా మార్చేశారు. ఇక అప్పట్నుంచి ఐమాక్స్ స్క్రీన్ కోసం తెలుగు వాళ్ల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది.

ఏదైనా హాలీవుడ్ విజువల్ వండర్ రిలీజైతే మన సినీ ప్రముఖులు చెన్నైకో, ఇంకో సిటీకో వెళ్లి ఐమాక్స్ స్క్రీన్లో సినిమా చూసే పరిస్థితి. సినిమాల కోసం పడి చచ్చే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఏంటి అని బయటి వాళ్లే ఆశ్చర్యపోతుంటారు.

ఐతే నిరీక్షణకు తెరదించుతూ హైదరాబాద్‌లో ఐమాక్స్ స్క్రీన్‌ను తీసుకొస్తోంది ఏషియన్ సంస్థ. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గతంలో సుదర్శన్ 70 ఎంఎం థియేటర్ ఉన్న ప్రదేశంలో మహేష్ బాబుతో కలిసి ‘ఏఎంబీ క్లాసిక్’ పేరుతో ఏషియన్ సంస్థ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అందులోనే ఐమాక్స్ స్క్రీన్ రాబోతోందని అధికారికంగా ప్రకటించారు.

ఐతే హైదరాబాద్‌లో ఇదొక్కటే ఐమాక్స్ స్క్రీన్ కాదన్నది విశ్వసనీయ సమాచారం. దీంతో పాటు మరో స్క్రీన్ కూడా నిర్మితం కానుందట. అది కూడా ఏషియన్, మహేష్ బాబు కాంబినేషన్లోనే వస్తుందట. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నిర్మాణం జరుపుకునే స్క్రీన్‌ను మించి ఇంకా భారీగా హకీం పేటలో ఐమాక్స్ థియేటర్ రాబోతోందట. నిజానికి గత ఏడాది ఒక ఇంటర్వ్యూలో ఏషియన్ సునీల్ నారంగ్ మాట్లాడినపుడు హకీంపేటలోనే ఐమాక్స్ వస్తుందని ప్రకటించారు.

కానీ అంతకంటే ముందు ఏఎంబీ క్లాసిక్‌లో ఐమాక్స్ స్క్రీన్ తీసుకొస్తున్నారు. హకీం పేట ప్రపోజల్ ఏమీ పక్కన పడేయలేదు. అక్కడ ఇంతకంటే భారీ ఐమాక్స్ థియేటర్ నిర్మిస్తారట. అంతే కాదు.. ఇండియాలోని మరో పెద్ద సిటీలో ఏఏంబీ ఆధ్వర్యంలో ఇంకో ఐమాక్స్ స్క్రీన్ కూడా నిర్మిస్తారట. ఒకవేళ అది వైజాగ్ లాంటి చోట వచ్చినా ఆశ్చర్యం లేదు. ఐమాక్స్ సంస్థతో మొత్తంగా మూడు స్క్రీన్లకు ఏఎంబీ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

This post was last modified on June 2, 2026 2:48 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

57 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago