ఏడాది చివర్లో మోస్ట్ వెయిటెడ్ మూవీస్ గా ఫేస్ టు ఫేస్ తలపడబోతున్న సలార్, డంకీ రెండు ట్రైలర్లు వచ్చేశాయి. సహజంగానే ఎవరిది పై చేయి అనే ఆసక్తి కలుగుతుంది. ప్రభాస్ లేట్ ఎంట్రీ, లుక్స్, డబ్బింగ్ మీద సోషల్ మీడియాలో ఎన్ని కామెంట్లు వచ్చాయో చూశాం. ఇప్పుడు అచ్చం అదే తరహాలో డంకీలో షారుఖ్ ఖాన్ గొంతు మీద కూడా అంత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కనిపించడం లేదు. ఏదో తేడా ఫీలింగ్ అయితే కలిగింది. అరటిపండు వలిచినట్టు ఇద్దరు దర్శకులు కథలోని కీలక పాయింట్ ని చెప్పేశారు. ప్రశాంత్ నీల్, రాజ్ కుమార్ హిరానీలు దాచే ప్రయత్నమేది చేయలేదు.
ఇక రెస్పాన్స్ విషయానికి వస్తే వ్యూస్ సంగతి కాసేపు పక్కనపెట్టి చూస్తే సలార్, డంకీ రెండూ ఎగ్జైట్ మెంట్ ని పీక్స్ కు తీసుకెళ్లడంలో తడబడిన మాట వాస్తవం. ఎందుకంటే ఫ్యాన్స్ వీటి నుంచి చాలా ఎక్కువ ఆశిస్తున్నారు. ఊహాతీతమైన థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే బిజినెస్ కూడా క్రేజీగా జరుగుతోంది. అయితే ట్రైలర్ కట్ల మీద మిశ్రమ స్పందన రావడం ఊహించనిది. ఎందుకంటే యానిమల్ కి బజ్ తేవడంలో సందీప్ రెడ్డి వంగా ట్రైలర్ కట్ చేయించిన విధానం బజ్ ని అమాంతం పెంచేసింది. కానీ వీటికలా జరగలేదు.
సలార్ రెండో వర్షన్ ట్రైలర్ రెడీ అవుతోంది. డంకీ డ్రాప్ 5 పేరుతో ఇంకో కొత్త కంటెంట్ ఏమైనా ఇస్తారేమో వేచి చూడాలి. ఇంకో రెండు వారాలు మాత్రమే టైం ఉంది. హైప్ అంతకంతా పెరుగుతూ పోవాలి. ఓపెనింగ్స్ కి ఇది కీలకం కానుంది. క్రిస్మస్ టైంకంతా యానిమల్ నెమ్మదిస్తుంది కాబట్టి ఆలోగానే ఆడియన్స్ లో సలార్, డంకీ విపరీతమైన ఆసక్తి కలిగేలా పబ్లిసిటీ వేగం పెంచాలి. ప్రభాస్, షారుఖ్ లు ఇంకా పబ్లిక్ లోకి రాలేదు. జవాన్ ప్రమోషన్ కోసం నెల రోజులకు పైగా విపరీతంగా తిరిగిన బాద్షా రంగంలోకి దిగలేదు. డార్లింగ్ ఎప్పుడు వస్తాడో చూడాలి. మొత్తానికి ట్రైలర్ వన్ డే మ్యాచ్ ఎవరూ గెలవక టై అయినట్టే.