Movie News

సిల్క్ జీవితాన్ని ఇంకా డర్టీగా చూపిస్తారా

దశాబ్దాలు గడుస్తున్నా ఒకప్పటి హీరోయిన్, ఐటెం సాంగ్స్ డ్రీం గర్ల్ సిల్క్ స్మిత అంటే తెలుగు తమిళ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఎమోషన్. కేవలం ఆమె పాట కోసమే జనం థియేటర్లకు వెళ్లేవారంటే అతిశయోక్తి కాదు. ఓసారి దాసరి గారు సిల్క్ మీద తీయాల్సిన పాటను వద్దనుకున్నారని తెలుసుకుని డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా సినిమానే కొనమని చెప్పేశారంటే ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే సిల్క్ స్మిత జీవితం పూల బాట కాదు. చాలా వివాదాలు చూడాల్సి వచ్చింది. వ్యక్తిగత జీవితంలో చెలరేగిన అలజడుల గురించి అప్పటి పత్రికల్లో ఎన్నో కథనాలు వచ్చేవి.

వీటి ఆధారంగానే విద్యా బాలన్ టైటిల్ పాత్రలో 2011లో మిలన్ లుత్రియా దర్శకత్వంలో ది డర్టీ పిక్చర్ తీశారు. కమర్షియల్ మంచి విజయం సాధించడంతో పాటు ప్రశంసలు చాలానే వచ్చాయి. కొంత కాంట్రావర్సి కూడా రేగింది. ఇంతకన్నా చెప్పడానికి ఏం లేదనుకుంటున్న టైంలో చంద్రికా రవితో ప్యాన్ ఇండియా లెవెల్ లో ఇంకో మూవీకి శ్రీకారం చుడుతున్నారు. జయరామ్ దర్శకత్వంలో ఇది రూపొందనుంది. ఇంకా పేరు నిర్ణయించలేదు కానీ అన్ టోల్డ్ స్టోరీ అని ట్యాగ్ లైన్ పెట్టి ప్రపంచానికి తెలియని కథను చూపిస్తామని మేకర్స్ హింట్ ఇస్తున్నారు.

చంద్రిక రవి అంటే ఆ మధ్య వీరసింహారెడ్డిలో మనోభావాల్ దెబ్బ తిన్నాయే పాటలో బాలయ్యతో ఆడిపాడిన భామనే. లుక్స్ పరంగా బాగానే అనిపిస్తోంది కానీ అసలు డర్టీ పిక్చర్ కన్నా డర్టీగా ఇంకేం చూపిస్తారనే సందేహం కలుగుతోంది. అయినా ఒక దివంగత తార గురించి అందులోనూ విషాదంగా అనుమానాస్పద రీతిలో చనిపోయిన స్టార్ మీద కేవలం బిజినెస్ కోసం సినిమాలు తీయడం ఎంతవరకు సబబని నిన్నటి తరం అభిమానులు నిలదీస్తున్నారు. ఒకవేళ కాంట్రావర్సి వాడుకోవడమే కాన్సెప్ట్ అయితే ఏం చేయలేం. కనీసం ఆవిడ ఆత్మహత్య వెనుక అసలు రహస్యాన్ని బయటికి తీస్తే సంతోషమే.

This post was last modified on December 2, 2023 1:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్వాలిటీ క్యాస్టింగ్ – పూరి జగన్నాథ్ ప్లానింగ్

మాములుగా సీనియర్ దర్శకులకు వరసగా డిజాస్టర్లు పడితే కంబ్యాక్ కావడం అంత సులభంగా ఉండదు. అసలు వాళ్ళ కథలు వినడానికే…

58 minutes ago

ఇంజెక్షన్‌ల భయానికి చెక్ పెట్టిన కొత్త టెక్నాలజీ

ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని…

2 hours ago

ఏపీలో ఎన్నిక‌.. షెడ్యూల్ విడుద‌ల‌!

ఏపీలో కీల‌క‌మైన ఓ రాజ్య‌స‌భ సీటు ఎన్నిక‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా షెడ్యూల్ ప్ర‌క‌టించింది. వైసీపీ నుంచి…

2 hours ago

ప్రేమకథతో తిరిగి వస్తున్న బుట్టబొమ్మ

డీజే దువ్వాడ జగన్నాథంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నా హీరోయిన్ గా తన స్థాయిని అమాంతం పెంచేసిన సినిమాల్లో అల వైకుంఠపురములో…

2 hours ago

వరుసగా ఏఐ మేధావుల మరణాలు.. ఏం జరుగుతోంది?

చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…

3 hours ago

పెద్ది గురించి శివన్న….హైప్ పెంచేశాడన్నా

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ట్రెండింగ్…

3 hours ago