నిన్న వైజాగ్ లో జరిగిన హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో సహా అందరూ హాజరై అభిమానులకు మంచి జోష్ ఇచ్చారు. న్యాచురల్ స్టార్ నాని డిసెంబర్ ని మరో సంక్రాంతితో పోలుస్తూ ఖచ్చితంగా ఈ మూవీ అందరికీ నచ్చుతుందని హామీ ఇచ్చేశాడు. ఇదంతా బాగానే ఉంది నిర్వాహకుల అత్యుత్సాహం వల్ల చేసిన ఒక పొరపాటు సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారానికి దారి తీసింది. యాంకర్ సుమ కొందరు సెలబ్రిటీ జంటల ఫోటోలు చూపిస్తూ టీమ్ ని ప్రశ్నలు అడిగే గేమ్ లో భాగంగా స్క్రీన్ మీద విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు సేదతీరుతున్న పిక్ చూపించారు.
దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. విజయ్, రష్మికలు వేర్వేరుగా ఒకే లొకేషన్ లో తీసుకున్న ఫోటోలను పక్కపక్కన పెట్టేసి దానికేదో నిర్వచనం ఇవ్వాలనుకోవడం మిస్ ఫైర్ అయ్యింది. హఠాత్తుగా ఇది జరిగే సరికి నాని ఏమనాలో అర్థం కాక నవ్వు ఎక్స్ ప్రెషన్ ఇవ్వగా, మృణాల్ ఠాకూర్ వాటీజ్ దిస్ అంటూ ఆశ్చర్యపోవడం స్పష్టంగా కనిపించింది. కెమెరామెన్, ఎడిటర్ మీద జోకు వేస్తూ సుమ ఏదో కవర్ చేయబోయింది కానీ లైవ్ ఈవెంట్ కావడంతో దాని తాలూకు వీడియోలు బయటికి వచ్చేసి ట్విట్టర్ లో హల్చల్ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం ఇదేం వాడకమని అంటున్నారు.
ఇదంతా నానికి తెలిసి జరిగింది కాదు. సరదాగా ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని సడన్ సర్ప్రైజ్ లు నిర్వాహకులు ప్లాన్ చేయడం సహజం. కానీ కొన్ని సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య ఏముందో వాళ్లే బహిర్గతంగా చెప్పే దాకా గాసిప్ గానే తీసుకోవాలి. అన్ స్టాపబుల్ షోలోనూ బయటపడని సంగతి మర్చిపోకూడదు. అలాంటిది లక్షలాది మంది చూస్తున్న వేడుకలో ఇలా ప్రైవేట్ ఫోటోలతో ఏదో చేయబోయి ఇంకేదో టార్గెట్ చేసుకున్నారు. డిసెంబర్ 7 విడుదల కాబోతున్న హాయ్ నాన్న ప్రమోషన్ల కోసం నాని ఎడతెరపి లేకుండా తిరుగుతూనే ఉన్నాడు
This post was last modified on November 30, 2023 11:29 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…