సెప్టెంబరు 5 కోసం ఇటు ఇండస్ట్రీ జనాలు.. అటు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో సైతం ఈ డేట్ ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా బాలీవుడ్ నుంచే బడా సినిమాలు ఓటీటీల్లో నేరుగా రిలీజయ్యాయి. సౌత్‌లో అన్నీ చిన్న సినిమాలే వచ్చాయి. ఇప్పటిదాకా ‘వి’ స్థాయి సినిమా ఏదీ సౌత్ ఇండియాలో నేరుగా ఓటీటీలో రిలీజ్ కాలేదు.
ఈ స్థాయి సినిమా ఇక్కడ రిలీజై ఎలాంటి స్పందన రాబట్టుకుంటుంది.. ఆ సినిమాను కొన్న అమేజాన్ ప్రైమ్‌కు ఎలాంటి ఫలితాన్నందిస్తుంది.. పెట్టుబడికి తగ్గ ప్రయోజనం చేకూరుస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటిదాకా ఓటీటీల్లో రిలీజైన సినిమాల మీద అవి పెట్టిన పెట్టుబడి తక్కువ. కాబట్టి వాటికి ఏ స్థాయిలో వ్యూస్ ఉన్నాయి.. కొత్తగా ఏ మేర సబ్‌స్క్రిప్షన్లు పెరిగాయన్నది పెద్ద విషయం కాదు.
కానీ ‘వి’ సినిమా అలా కాదు. దాని మీద అమేజాన్ ప్రైమ్ రూ.32 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ సినిమాకు ఏ స్థాయిలో వ్యూస్ వస్తాయన్నది కీలకం. దాన్ని బట్టే ఆ యాప్‌కు తెలుగులో ఉన్న రీచ్ ఏంటో.. కొత్తగా ఎన్ని సబ్‌స్క్రిప్షన్లు పెరిగాయో తెలుస్తుంది. ఇప్పటిదాకా ఇలాంటి ప్రయోజనం బాలీవుడ్ సినిమాలు మాత్రమే చేకూరుస్తాయని.. వాటి మీద భారీ పెట్టుబడులు పెట్టాయి ఓటీటీలు. సౌత్ సినిమాల మీద అలాంటి నమ్మకం కుదర్లేదు. అలాగే ఇక్కడి నిర్మాతలు కూడా ఓటీటీల్లో రిలీజ్ చేసే విషయంలో వెనుకంజ వేశారు.
‘వి’ కనుక భారీగా ప్రేక్షకుల్ని ఆకర్షించి.. పెద్ద ఎత్తున వ్యూస్ తెచ్చుకుంటే, కొత్త సబ్‌స్క్రిప్షన్లను పెంచితే.. ఓటీటీలు తెలుగు సినిమాల మీద కూడా పెద్ద పెట్టుబడులు పెడతాయి. మరిన్ని సినిమాలకు మంచి డీల్స్ వస్తాయి. ఇరు వైపులా ప్రయోజనం ఉంటుంది. అలాగే థియేటర్లకు దూరమైన ప్రేక్షకులకు కూడా మంచి వినోదం అందుతుంది. మరి సెప్టెంబరు 5న నాని సినిమా ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.
This post was last modified on August 31, 2020 9:51 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…