ఇప్పుడంతా ఎక్కడ చూసినా యానిమల్ గురించిన చర్చలు, టికెట్ల గురించిన వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సలార్ విడుదల ఇంకో ఇరవై మూడు రోజులు మాత్రమే ఉండటం చూసి ప్రమోషన్ పరంగా టెన్షన్ పడుతున్నారు. డిసెంబర్ 1 సాయంత్రం ట్రైలర్ విడుదలకు హోంబాలే ఫిలిమ్స్ రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లో టైమర్ తో సహా మొత్తం సెట్ చేసి పెట్టారు. మరోవైపు డంకీ ట్రైలర్ కట్ సెన్సార్ చేసుకుని రెడీగా ఉంది. రెండు నిమిషాల నలభై సెకండ్ల వెర్షన్ ని ఎప్పుడు రిలీజ్ చేయాలనే చర్చలో రాజ్ కుమార్ హిరానీ బిజీగా ఉన్నారు.
ఈ యానిమల్ హడావిడి రెండు మూడు రోజులు బలంగా ఉంటుంది కాబట్టి కాస్త వేచి చూసి ఆపై నాన్ స్టాప్ గా ప్రమోషన్లు చేసేందుకు సలార్ టీమ్ రెడీ అవుతోంది. ట్రైలర్ లాంచ్ కి ఈవెంట్ చేసేది లేనిది ఇంకా తెలియదు. ప్రభాస్ అందుబాటులోనే ఉన్నాడు కానీ చెన్నై, హైదరాబాద్, ముంబై ఈ మూడు నగరాల్లో ఒక వేదిక మీద నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కానీ ప్రస్తుతానికి ఆ సూచనలైతే కనిపించడం లేదు. దీన్ని సింపుల్ గా కానిచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్లను పలు నగరాల్లో ఘనంగా చేయడం గురించి సీరియస్ గా చూస్తున్నారట. ఏదీ ఫైనల్ చేయలేదు.
ఇక్కడింకో సమస్య ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు. రవి బస్రూర్ రీ రికార్డింగ్ సైతం విపరీతమైన ఒత్తిడిలో జరుగుతోంది. సెన్సార్ కాపీ సిద్ధమయ్యే దాకా ఈ ఇద్దరూ రిలాక్స్ అయ్యే పరిస్థితి లేదు. ఎలాగూ ట్రైలర్ వచ్చాక అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ ఎలాంటి ఓవర్ పబ్లిసిటీ అక్కర్లేదని నీల్ అభిప్రాపడుతున్నారట. ఇంకా లిరికల్ వీడియోస్ వదలాలి. డిసెంబర్ 22 ఎంతో దూరంలో లేదు. రోజులు గడిచే కొద్దీ అభిమానుల ఎగ్జైట్ మెంట్ తారాస్థాయికి చేరుకుంటోంది. రెండో వారంలోనే బుకింగ్స్ మొదలవుతాయి.
This post was last modified on November 28, 2023 11:28 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…