ఇవాళ సాయంత్రం జరగబోయే యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మల్లారెడ్డి యూనివర్సిటీ రెడీ అవుతోంది. హీరో హీరోయిన్ తో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్ అందరూ ఈ వేడుకలో పాలు పంచుకోబోతున్నారు. ముఖ్య అతిథులుగా మహేష్ బాబు, రాజమౌళి రానున్నారని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు అలెర్టయిపోయారు. విపరీతమైన రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో కేవలం కాలేజ్ విద్యార్థులు, స్టాఫ్ కు మాత్రమే అనుమతి ఉంటుందనే మెసేజ్ రాత్రి నుంచి తెగ చక్కర్లు కొడుతోంది. అదేమీ లేదని ఎవరైనా హాజరు కావొచ్చని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
అయినా సరే ఎందుకైనా మంచిదేనని మల్లారెడ్డి స్టూడెంట్స్ గా లోపలి ప్రవేశించేందుకు కొందరు ఏకంగా ఐడి కార్డులు కూడా తయారు చేయించుకోవడానికి సిద్ధ పడటం అసలు ట్విస్టు. ఒకవేళ కామన్ పబ్లిక్ కి అనుమతి లేకపోతే లోపలికి ప్రవేశించడానికి ఇంతకన్నా మార్గం లేదు. ఇంత ఎగ్జైట్ అవ్వడానికి కారణాలున్నాయి. రన్బీర్, సందీప్, రష్మిక, అనిల్ కపూర్ లు మహేష్ గురించి చెప్పే నాలుగు మాటలు లైవ్ లో చూస్తేనే కిక్ వస్తుంది. అదే స్టేజి మీద రాజమౌళి ఉంటారు కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లో రూపొందబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి ఏదైనా చెప్తారనే ఆశ మరొక రీజన్.
ఇవి కాకుండా యానిమల్ గురించి మహేష్ చెప్పబోయే విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఒక్కడు టైంలో ఆ సినిమాని రన్బీర్ చూసిన వైనం, రష్మికతో సరిలేరు నీకెవ్వరు జ్ఞాపకాలు, వీటితో పాటు జక్కన్న గురించి ఓ రెండు ముక్కలు, చివరిగా యానిమల్ మీద తనకున్న అంచనాలు ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తేనే మజా అనేది ఫ్యాన్స్ అభిప్రాయం. విశాలమైన మైదానంలో చేస్తున్నప్పటికీ అందరికీ పర్మిషన్లు ఇస్తే మాత్రం చోటు సరిపోయేలా లేదు. ఎంత ఐడి నిబంధన పెట్టినా ఒరిజినల్, నకిలీలను పసిగట్టడం అంత సులభం కాదు. సినిమా రేంజ్ లో హడావిడి ఈవెంట్ కి రావడం మహేష్ వల్లనే.
This post was last modified on November 27, 2023 11:08 am
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…