ఈ ఏడాది దసరా రూపంలో అతి పెద్ద మాస్ బ్లాక్ బస్టర్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని డిసెంబర్ 7న హాయ్ నాన్నగా రాబోతున్నాడు. ప్రమోషన్లు మొత్తం అంతా తానై సోలోగా నడిపిస్తూ ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. వెరైటీ వీడియోలు ఇప్పటికే ఆకట్టుకోగా ట్రైలర్ మీద మంచి అంచనాలున్నాయి. అందులోనూ అనిమల్ వచ్చిన కేవలం ఆరు రోజులకే రిలీజ్ ప్లాన్ చేసుకోవడంతో పోటీ పరంగా నాన్నకు సవాల్ ఎదురు కాబోతోంది. శౌర్యువ్ దర్శకత్వం వహించిన హాయ్ నాన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నాని కాన్ఫిడెన్స్ ఈ రోజు మరోసారి బయట పడింది.
కూతురు తార(బేబీ కియారా) లోకంగా బ్రతికే నాన్న(నాని)తనకు ఏ లోటు రాకుండా ప్రాణంగా పెంచుకుంటూ ఉంటాడు. ఓసారి రోడ్డు ప్రమాదంలో పాపను ఓ అమ్మాయి(మృణాల్ ఠాకూర్)కాపాడి వీళ్లకు దగ్గరవుతుంది. రోజుకో కథ చెప్పి నిద్రపుచ్చే తండ్రిని పాప అమ్మ గురించి చెప్పమని అడుగుతుంది. అందులో భాగంగా అతని గతం మొదలవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇంటికి వచ్చాక జరిగిన సంఘటనలు, వచ్చిన మనస్పర్థలు, అసలు ఎలా దూరమయ్యింది లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం మొదలు పెడతాడు. ఈ ముగ్గురి ప్రయాణం ఏ తీరానికి చేరుకుందో కొద్దిరోజులు ఆగి చూడాలి.
దర్శకుడు శౌర్యువ్ భావోద్వేగాలను చాలా బలంగా తాకేలా హాయ్ నాన్నను రూపొందించినట్టు కనిపిస్తోంది. నాని, బేబీ కియారా, మృణాల్ మధ్య కెమిస్ట్రీ క్యూట్ గా ఉంది. వర్తమానం, గతం రెండు ఎపిసోడ్లలోనూ ఒకే హీరోయిన్ ని పెట్టడం ద్వారా చేసిన ప్రయోగం బాగుంది. హేశం అబ్దుల్ వహాబ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంటెంట్ కు తగ్గట్టు ఫీల్ గుడ్ గా సాగింది. క్వాలిటీ, ఎమోషన్ ఆణువణువూ తొణికిసలాడుతున్న హాయ్ నాన్న తాను టార్గెట్ గా పెట్టుకున్న ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాడు. అంచనాలు అందుకోగలిగితే నిన్ను కోరి, జెర్సీలను మించి మరో మెమొరబుల్ మూవీ నానికి దక్కినట్టే.
This post was last modified on November 24, 2023 7:39 pm
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.…
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఆయన…
ఐపీఎల్లో రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలు గెలిచిన జట్టు ముంబయి ఇండియన్స్. కానీ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది.…
డైలాగ్ కింగ్ మంచు మోహన్బాబు ఇంట్లో ఇటీవల కాలంలో పలు రగడలు తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ఆస్తుల వివాదాలు…
మొదటిసారి విడుదలైనప్పుడు ఫ్లాప్ అనిపించుకుని ఏళ్ళు గడిచేకొద్దీ కల్ట్ ముద్రతో రీ రిలీజులు సూపర్ హిట్ కావడం ఈ మధ్య…
కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాలు గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి…