బాక్సాఫీస్ వద్ద అయిదో వారంలోనూ నిలకడ చూపిస్తున్న భగవంత్ కేసరి నిన్న అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. మాములుగా ఇలాంటి పెద్ద సినిమా రిలీజ్ టైంలో ప్రమోషన్లతో భారీ హడావిడి చేసే ఈ డిజిటల్ కంపెనీ ఇప్ప్పుడు స్ట్రాటజీ మార్చింది. ముందు గుట్టుచప్పుడు కాకుండా విడుదల చేసి ఆ తర్వాత సోషల్ మీడియాతో మొదలుపెట్టి శాటిలైట్ ఛానల్స్ దాకా ప్రచారాన్ని ఊపందుకునేలా చేస్తుంది. గత వారం టైగర్ నాగేశ్వరరావుకు ఇదే ఫాలో అయిన ప్రైమ్ ఇప్పుడు బాలయ్య మూవీకి అంతకు మించి పబ్లిసిటీని గట్టిగా ప్లాన్ చేస్తోంది.
ఇప్పుడొచ్చిన భగవంత్ కేసరి మరోసారి చూసేందుకు బాలయ్య అభిమానులకో బలమైన కారణం దొరికింది. మొదటిసారి ఆయన స్వయంగా హిందీలో డబ్బింగ్ చెప్పిన వెర్షన్ ని అందుబాటులో ఉంచారు. ఈ విషయాన్ని ఇటీవలే సక్సెస్ మీట్ లో చెప్పిన బాలకృష్ణ నిజంగానే స్వంత గొంతుతో మెప్పించారు. అర్జున్ రామ్ పాల్ కు ధీటుగా డైలాగులు చెబుతున్న వీడియోలను ఫ్యాన్స్ ఆల్రెడీ షేర్ చేయడం మొదలుపెట్టారు. ముందస్తు ఒప్పందాల కారణంగా నాలుగు వారాలు దాటగానే భగవంత్ కేసరి ఓటిటిలో వచ్చింది. దీంతో పాటే రావాల్సిన లియోని ఆలస్యంగా మధ్యాన్నం నుంచి వదులుతున్నారు.
బ్యాక్ టు బ్యాక్ బాలయ్యకు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కాబట్టి భగవంత్ కేసరి ప్రైమ్ కి భారీ వ్యూస్ తేవడం ఖాయమే. గత కొన్ని నెలలుగా నెట్ ఫ్లిక్స్ దూకుడుకి పెద్ద సినిమాలు చేజార్చుకున్న ప్రైమ్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. అందుకే అన్ని భాషలను ఒకేసారి డబ్బింగ్ రూపంలో ఇస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే పాయింట్ ఎంతగా ఫ్యామిలీ జనాలకు రీచ్ అయ్యిందో చూస్తున్నాం. గత పది రోజులుగా పలు చోట్ల స్కూల్ పిల్లలకు ప్రత్యేకంగా షోలు వేసి మరీ భగవంత్ కేసరిని చూపిస్తున్నారు. ఇప్పుడిక నేరుగా పాఠశాలల్లోనే వేస్తారేమో.
This post was last modified on November 24, 2023 9:47 am
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…