Political News

ర‌మ్మంటున్నా.. రానంటున్న కేటీఆర్‌.. మునుగోడు ముచ్చట తెలుసా?

ఎన్నిక‌ల వేళ.. అగ్ర‌నాయ‌కుల ప్ర‌చారం కోరుకోని అభ్య‌ర్థులు ఎవ‌రుంటారు? అగ్ర‌నేత‌లు వ‌స్తే.. త‌మ గెలుపున‌ల్లేరుపై న‌డ‌కే అవుతుంద‌ని భావించ‌ని నాయ‌కులు ఎవ‌రుంటారు? అందుకే.. ఇప్పుడు తెలంగాణ‌లో అధికార పార్టీ బీఆర్ ఎస్ స‌హా కాంగ్రెస్‌లోఅగ్ర‌నేత‌ల‌కు డిమాండ్ పెరిగిపోయింది. ఐదు నిమిషాలు వ‌చ్చి ప్ర‌చారంలో ఇలా క‌నిపించి.. అలా వెళ్లిపోండి అంటూ.. ఈ రెండు పార్టీల్లోనూ అగ్ర‌నేత‌ల‌కు అభ్య‌ర్థుల నుంచి విన్న‌పాలు వ‌స్తున్నాయి.

ఇలానే బీఆర్ ఎస్ అగ్ర‌నేత, మంత్రి కేటీఆర్ కు కూడా అభ్య‌ర్థుల నుంచి ఫోన్లు.. మెసేజ్‌లు జోరుగా వ‌స్తున్నాయి. మా నియోజ‌క‌వ‌ర్గానికి రండి అంటే.. మా నియోజ‌వ‌క‌ర్గానికి రండి అంటూ నాయ‌కులు కోరుతున్నారు. ఈ క్ర‌మంలో కేటీఆర్ నిన్న మొన్న‌టి వ‌ర‌కు సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు. అయితే.. డిజిట‌ల్ మీడియాలో కాంగ్రెస్ జోరుగా ఉండ‌డంతో దీనికి అడ్డుక‌ట్ట వేసేందుకు ఇంట‌ర్వ్యూలు, చిట్ చాట్‌ల‌కు ఆయ‌న ప్రాధాన్యం ఇస్తూ.. నిరంత‌రం టీవీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు.

ఇదిలావుంటే.. త‌న త‌ర‌ఫున ప్ర‌చారం చేయాల‌ని మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత బీఆర్ ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి కేటీఆర్‌ను కోరుతున్నారు. ఒక్క‌సారివ‌చ్చి పోరాదే! అని ప్రాధేయ ప‌డుతున్నారు. ఎందుకంటే.. కాంగ్రెస్ నుంచి బ‌ల‌మైన నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి ఇక్క‌డ నుంచి పోటీలో ఉండ‌డ‌మే దీనికి కార‌ణం. పైగా క‌మ్యూనిస్టులు కూడా.. వేరుగా పోటీ చేస్తున్నారు. దీంతో ప్ర‌భాక‌ర్‌రెడ్డి గెలుపుపై ఆశ‌లు స‌న్న‌గిల్లుతున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలో కేటీఆర్ ద్వారా అయినా.. ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ ఎంత అడిగినా.. కేటీఆర్ మాత్రం కాలు క‌ద‌ప‌డం లేదు. మునుగోడు ముచ్చ‌ట‌ను ప‌ట్టించుకోవ‌డం కూడా లేదు. దీంతో ఆయ‌న ఎందుకు ఇంత‌గా దీనిపై శీత‌క‌న్నేశారు? అనే చ‌ర్చ సాగుతోంది. దీనికి ప్ర‌ధానంగా.. గ‌త ఏడాది జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కేటీఆర్ ఇక్క‌డ విస్తృతంగా ప్ర‌చారం చేశారు. ఇక్క‌డే మ‌కాం వేశారు. ఇక్క‌డ క‌నుక ఉప ఎన్నిక‌లో కూసుకుంట్ల‌ను గెలిపిస్తే.. మునుగోడును తానే ద‌త్త‌త తీసుకుని డెవ‌ల‌ప్ చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

సిరిసిల్ల మాదిరిగా మునుగోడును ప‌రుగులు పెట్టిస్తాన‌ని, ద‌ళిత బంధును పూర్తిగా అమ‌లు చేస్తామ‌ని.. ఇళ్లు ఇస్తామ‌ని.. ఇలా అనేక హామీలు గుప్పించారు. ఏదేమైనా.. ఉప ఎన్నిక‌ల్లో కూసుకుంట్ల‌కు మునుగోడు ప్ర‌జ‌లు జై కొట్టారు. క‌ట్ చేస్తే.. ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే ఉన్నాయి. అంతేకాదు.. ఉప పోరు త‌ర్వాత‌.. కేటీఆర్ క‌నీసం క‌న్నెత్తి కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గం వైపు చూడ‌లేదు. దీంతో ఇప్పుడు మ‌రోసారిఇక్క‌డ‌కు వ‌చ్చి.. ఏం చెప్పాలి? అనేది ఆయ‌న ఆలోచ‌న కావొచ్చ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అందుకే మునుగోడు ముచ్చ‌ట‌ను పక్క‌న పెట్టార‌ని చెబుతున్నారు.

This post was last modified on November 24, 2023 9:59 am

Share
Show comments

Recent Posts

అవసరమైతే విదేశీ డాక్టర్లతో రేవతి కుమారుడు శ్రీతేజ్ కు వైద్యం!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…

6 minutes ago

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

1 hour ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

3 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

3 hours ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

3 hours ago

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

5 hours ago