ఎన్నికలకు కొంతకాలం ముందువరకు కేసీయార్, కేటీయార్, హరీష్ రావులు పదేపదే కాళేశ్వరం ప్రాజెక్టును బాగా హైలైట్ చేసేవారు. ఎక్కడ ఏ సందర్భం వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఘనంగా చెప్పుకునే వారు. తాము కాబట్టే అంత బారీ ప్రాజెక్టును కట్టగలిగినట్లు ప్రకటించుకునేవారు. కేంద్రప్రభుత్వం సరైన మద్దతు ఇవ్వకపోయినా కేసీయార్ ఒంటిచేత్తో ప్రాజెక్టును నిర్మించినట్లు అభినందించేవారు. నిజంగానే కాళేశ్వరం అంత గొప్ప నిర్మాణమే అయితే ఇపుడు దాని గురించి మాటమాత్రంగా కూడా ఎదుకుని ప్రస్తావించటంలేదు.
ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులోని డొల్లతనం బయటపడింది కాబట్టే. ఆమధ్య గట్టిగా కురిసిన వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ ముణిగిపోయింది. చాలా మోటార్లు పనిచేయలేదు. ప్రాజెక్టు లోపలకంతా నీళ్ళొచ్చేశాయి. దాంతోనే ప్రాజెక్టు నిర్మాణంలోని లోపాలు బయటపడ్డాయి. పాడైపోయిన పంపుహౌస్, మోటార్లను రిపేర్టు చేయటానికి విదేశాల నుండి ఇంజనీర్లు రావాల్సిందే అని అప్పట్లోనే మన ఇంజనీర్లు తేల్చిచెప్పారు. అప్పటినుండి ప్రాజెక్టు ఘనత గురించి చెప్పుకోవటం తగ్గించేశారు.
ఈమధ్యనే అంటే ఎన్నికల హీట్ బాగా పెరిగిపోతున్న సమయంలో సడెన్ గా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి పిల్లర్ కుంగిపోయింది. పిల్లర్ కుంగిపోవగంతో బ్యారేజికి కూడా క్రాక్ వచ్చేసింది. దాంతో మేడిగ్గడ బ్యారేజిలో అవినీతి బయటపడింది. ఇదే సమయంలో అన్నారం ప్రాజెక్టులో అవినీతి కూడా బయటపడింది. దాంతో ఇపుడు కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల గురించి మాట్లాడాలంటేనే కేసీయార్ అండ్ కో భయపడుతున్నారు. ప్రాజెక్టుల గురించి మాట్లాడితే పరువు పోవటమే కాకుండా చెత్తను తమంతట తామే నెత్తిన వేసుకున్నట్లవుతుందని అసలా ప్రస్తావన కూడా తేవటంలేదు.
పోనీ వీళ్ళు ప్రస్తావించటంలేదు సరే ప్రతిపక్షాల ఆరోపణలకైనా సమాధానాలు ఇస్తున్నారా అంటే అంత ధైర్యం చేయటంలేదు. అసలు కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు తెలంగాణాలో లేవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్ధులు ఎవరు పై ప్రాజెక్టుల గురించి ఎక్కడా మాట్లాడద్దని, ఎవరైనా ప్రశ్నించినా సమాధానాలు చెపవద్దని కేసీయార్ స్పష్టంగా ఆదేశించారట. దీంతోనే అర్ధమైపోతోంది కేసీయార్ చెప్పుకున్న ప్రాజెక్టుల నిర్మాణాలు ఎంతటి ఘనమైనవో. అందుకనే ఎన్నికల్లో ఎక్కడా వాటి ప్రస్తావనే తేవటంలేదు.
This post was last modified on November 24, 2023 10:28 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…