టాలీవుడ్లో కొన్ని విజయవంతమైన డైరెక్టర్-రైటర్ జోడీలున్నాయి. విజయభాస్కర్-త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీను వైట్ల-కోన వెంకట్, సురేందర్ రెడ్డి-వక్కంతం వంశీ జోడీలు ఈ కోవలోనివే. వీళ్ల కలయికలో మరపురాని సినిమాలు వచ్చాయి. ఐతే కొంత కాలం తర్వాత ఈ జోడీలు విడిపోక తప్పలేదు. త్రివిక్రమ్ దర్శకుడిగా మారి పెద్ద రేంజికి వెళ్లగా, విజయభాస్కర్ మరుగున పడిపోయాడు.
శ్రీను వైట్ల, కోన వెంకట్ మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారు. తర్వాత ఇద్దరూ గాడి తప్పారు. సురేందర్, వంశీ మధ్య మరీ పెద్ద గొడవలేమీ కాలేదు కానీ.. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందన్నది మాత్రం వాస్తవం. అందుకు కిక్-2 డిజాస్టర్ కావడం కూడా ఓ కారణం కావచ్చు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పని చేయలేదు.
సురేందర్ ధృవ, సైరా సినిమాలకు వేరే రచయితలతో పని చేశాడు. వంశీ దర్శకుడిగా మారి నా పేరు సూర్య సినిమా తీశాడు. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అతడి కెరీర్ గందరగోళంగా మారింది. సైరా తర్వాత సురేందర్ సైతం సరైన ప్రాజెక్టు సెట్ కాక ఇబ్బంది పడుతున్నాడు.
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కోసం వంశీ ఓ కథ రాసి పవన్ మిత్రుడైన నిర్మాత రామ్ తాళ్లూరికి వినిపించడం.. అతను ఓకే చేయడం.. పవన్ ఈ సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇవ్వడం, ఈ ప్రాజెక్టుక సురేందర్‌ను దర్శకుడిగా ఎంచుకోవడం జరిగినట్లు వార్తలొస్తున్నాయి. ముందు విభేదాల సంగతెలా ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసే అవకాశం రావడంతో పాత విషయాలన్నీ పక్కన పెట్టి సురేందర్, వంశీ కలిసి పని చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
This post was last modified on August 30, 2020 10:25 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…