ఇటీవలే నాగచైతన్య హఠాత్తుగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. నిజానికి మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా అధిక శాతం స్టార్ హీరోలకు ఛానల్స్ ఉన్నప్పటికీ వాటిలో రెగ్యులర్ గా కంటెంట్ అప్లోడ్ చేయరు. ట్విట్టర్, ఇన్స్ టా మీద ఉన్న ఫోకస్ ఈ వీడియో ప్లాట్ ఫార్మ్ మీద పెట్టరు. ఆడియో కంపెనీలకు హక్కులు అమ్మేసి ఉంటారు కాబట్టి పాటలు, ట్రైలర్లు పెట్టడానికి కూడా ఛాన్స్ ఉండదు. అందుకే ఫ్యాన్స్ సైతం వీటిని లైట్ తీసుకుంటారు. ఇంత రివర్స్ ట్రెండ్ నడుస్తున్న టైంలో చైతు ఛానల్ పెట్టడంతో ఆశించిన స్థాయిలో భారీ స్పందన కనిపించడం లేదు.
దీని వెనుక ప్రత్యేక కారణం ఉందట. చైతు డిజిటల్ డెబ్యూ వచ్చే నెల డిసెంబర్ 1న ప్రైమ్ లో దూత వెబ్ సిరీస్ ద్వారా జరగబోతున్న సంగతి తెలిసిందే. దీని ప్రమోషన్ కోసం చైతన్య పేరు మీద ఒక ఛానల్ ఓపెన్ చేస్తే దాని ద్వారా ఎక్కువ రీచ్ వస్తుందని భావించి ప్రైమ్ ప్రతినిధులు ప్రత్యేకంగా అడిగారట. ఎలాగూ ఎప్పటి నుంచో ఆలోచన కాబట్టి పుణ్యం పురుషార్థం రెండూ దక్కుతాయనే ఆలోచనతో అక్కినేని హీరో ఓకే చెప్పాడు. అందులో భాగంగానే తాజాగా కొందరు అభిమానులను కలుసుకున్న సర్ప్రైజ్ మూమెంట్స్ ని ఇందులోనే పంచుకున్నాడు. అందులో దూతనే హైలైట్ చేశారు.
చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ కోసం రెడీగా ఉన్న నాగచైతన్య ఒక్కసారి దూత స్ట్రీమింగ్ లోకి వచ్చాక ఒక వారం గ్యాప్ తీసుకుని సెట్స్ లోకి అడుగు పెడతాడు. ఇకపై తన షూటింగ్ కబుర్లు, వ్యక్తిగత విషయాలు, అప్డేట్లు అందులో పెడతాడో లేదో చూడాలి. ఒకవేళ క్రమం తప్పకుండ కంటెంట్ లేకపోతే మాత్రం ఇది దూత కోసమేనని అందుకోవాలి. వరస ఫ్లాపులతో ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తున్న చైతుకి బలమైన కంబ్యాక్ అవసరం. ఓటిటి అయినా కూడా దూతలో క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుందని, ఆడియన్స్ ని షాక్ చేస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు.
This post was last modified on November 21, 2023 3:22 pm
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…