Movie News

విశ్వక్ మౌనం దేనికి సంకేతం?

కొన్ని వారాల ముందు తన కొత్త చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ డేట్ విషయమై హీరో విశ్వక్సేన్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒక పోస్టు, విధించిన అల్టిమేటం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాను డిసెంబరు 8న రిలీజ్ చేయాలని చాలా ముందుగానే నిర్ణయించారు. కానీ క్రిస్మస్ సినిమాల మీద ‘సలార్’ బాంబు పడటంతో లెక్కలు మారిపోయాయి. హాయ్ నాన్న, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు సైతం డిసెంబరు రెండో వారానికి షెడ్యూల్ అయ్యాయి.

ఆల్రెడీ వరుణ్ తేజ్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సైతం డిసెంబరు రెండో వారానికే ఫిక్స్ కావడంతో పితలాటకం తప్పలేదు. ఒకటి లేదా రెండు సినిమాలను వాయిదా వేయాల్సిన పరిస్థితి. విశ్వక్ సినిమానే వాయిదా వేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో.. బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్ల తొక్కేస్తున్నారని, డేట్ మారిస్తే ప్రమోషన్లకే రానన్నట్లుగా పోస్టు పెట్టాడు విశ్వక్.

ఇది నిర్మాత నాగవంశీకి కూడా ఇబ్బందికరంగా మారింది. డేట్ మార్చకపోతే ఇండస్ట్రీలో ఇబ్బంది తప్పదు. సినిమాకూ సమస్యే. మారిస్తే హీరో ఒప్పుకోడు. మరి నాగవంశీ ఏం చేస్తాడా అని అంతా ఎదురు చూశారు. ఐతే ఈ మధ్య నాగవంశీ మాటల్ని బట్టి సినిమాను వాయిదా వేస్తున్నట్లే కనిపించింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి ప్రస్తుతం ఎలాంటి సౌండ్ లేదు. దాన్ని బట్టి సినిమా డిసెంబరు 8న రావడం కష్టమే అనిపిస్తోంది.

హాయ్ నాన్న సినిమా ప్రమోషన్ల పరంగా ముందుండగా.. ‘ఎక్స్‌ట్రా’ కూడా కొంత సందడి చేస్తోంది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఆ వీకెండ్‌ బరిలో ఉంటే కచ్చితంగా విశ్వక్ ఇప్పట్నుంచే హడావుడి చేసేవాడు. కాబట్టి సినిమా వాయిదా పడ్డట్లే. ఐతే సోషల్ మీడియాలో ఇంకే రకమైన యాక్టివిటీ కూడా లేకపోవడంతో విశ్వక్ తాను చెప్పినట్లే.. సినిమా వాయిదా పడితే ప్రమోషన్లకు రానన్న మాటకు కట్టబడి సైలెంట్ అయిపోతాడా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి టీంలో అంతర్గతంగా ఏం జరుగుతోందో?

This post was last modified on November 21, 2023 9:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

38 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago