Movie News

కెసిఆర్ రాహుల్ మధ్యలో హాయ్ నాన్న

హాయ్ నాన్న ప్రమోషన్ల విషయంలో నాని మాములు క్రియేటివిటీ చూపించడం లేదు. డిసెంబర్ 7 ఇంకో పదిహేడు రోజుల్లో రాబోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా స్పీడ్ పెంచేశాడు. మొన్న తెలంగాణ ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకుని లోకేష్ ని అనుకరిస్తూ ఆపై కిరాణా కొట్టు కామెంట్ల మీద విరుచుకుపడిన వాళ్ళ మీద సెటైర్లు వేస్తూ మంచి కిక్ ఇచ్చాడు. ఇప్పుడు మరో వీడియో బైట్ తో అభిమానుల ముందుకొచ్చాడు. ఈసారి ఏకంగా మూడు నిమిషాల కంటెంట్ తో రావడం విశేషం. ఇలా హీరో ఒక్కడే సోలోగా చేయడం ఆ మధ్య నవీన్ పోలిశెట్టి తర్వాత నానినే చూస్తున్నాం.

ఇక అసలు విషయానికి వస్తే నాని అచ్చం సిఎం కెసిఆర్ ని అనుకరిస్తూ అదే స్లాంగ్, భాషలో డమ్మీ మీడియా అడిగిన ప్రశ్నలకు వెరైటీ సమాధానాలు ఇచ్చాడు. ముఖ్యంగా జర్నలిస్టు రాహుల్ ని ఉద్దేశించి ప్రత్యేకంగా కేసీఆర్ ఏదైతే తమాషా చేస్తారో దాన్నే ఇమిటేట్ చేశాడు. ఏందివయ్యా రాహుల్ అంటూ పదే పదే సంబోధిస్తూ కొన్ని కౌంటర్లు ఇచ్చాడు. హాయ్ నాన్న వాయిదా పడే ప్రసక్తే లేదని తేల్చేశాడు. బయట ఎవరెన్ని ప్రచారాలు చేసినా తగ్గదేలే అంటూ నొక్కి చెప్పాడు. ఇది యాక్షన్ సినిమా కాదని లవ్ ప్లస్ ఫ్యామిలీ ఎమోషన్ రెండూ ఉంటాయని తేల్చేశాడు.

రివ్యూల గురించి మాట్లాడుతూ సినిమాలు బాగుంటే ఆడతాయి లేదంటే పోతాయని ఓపెన్ గా అనడం బాగుంది. కాసిన్ని జోకులు, పంచులతో నాని పూర్తిగా వన్ మ్యాన్ షో చేశాడు. నిజానికి ఈ పబ్లిసిటీకి హాయ్ నాన్నలో ఉన్న కథకు సంబంధం లేదు. ఆడియన్స్ అటెన్షన్ ని వన్ సైడ్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నమిది. డిసెంబర్ 8 వచ్చేందుకు ప్లాన్ చేసుకున్న నితిన్ ఎక్స్ ట్రాడినరి మ్యాన్ ప్రమోషన్ విషయంలో వెనుకబడి ఉంది. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, గ్యాంగ్స్ అఫ్ గోదావరిలు వాయిదా ఉందో లేదో ఇంకా చెప్పలేదు. వీళ్ళ సంగతేమో కానీ నాని మాత్రం నేనొక్కడినే రేంజ్ లో చెలరేగిపోతున్నాడు.

This post was last modified on November 20, 2023 9:28 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

1 hour ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

4 hours ago