మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చూపించిన స్పీడు ప్రకారం అయితే.. ఈపాటికి తన తర్వాతి సినిమా రిలీజైపోయి ఉండాలి. కానీ శంకర్‌తో సినిమా మొదలవడంలో, కొన్ని రోజుల పాటు షూటింగ్ సాగడంలో ఉన్న వేగం తర్వాత లేకపోయింది. ఏ ముహూర్తాన శంకర్ ‘ఇండియన్-2’ను తిరిగి పట్టాలెక్కించి రెండు సినిమాలనూ సమాతరంగా షూట్ చేయాలని అనుకున్నాడో అప్పట్నుంచే ‘గేమ్ చేంజర్’కు బ్రేక్ పడిపోయింది.
శంకర్ దృష్టంతా ‘ఇండియన్-2’ మీదికి మళ్లి.. ‘గేమ్ చేంజర్’కు సంబంధించి ఏదీ అనుకున్న ప్రకారం జరగక విలువైన సమయం వృథా అయింది. ఈ సినిమా చాలా చాలా ఆలస్యం అయిపోయింది. హీరో, నిర్మాత, అభిమానులు ఎంత సంయమనంతో ఉన్నప్పటికీ.. వారి సహనానికి మరింత పరీక్ష పెడుతున్నాడు శంకర్.
మరోవైపు చరణ్ కోసం బుచ్చిబాబు చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. చరణ్‌తో చేయాల్సిన సినిమాకు బుచ్చిబాబు ఎప్పుడో స్క్రిప్టు రెడీ చేశాడు. ప్రి ప్రొడక్షన్ సైతం పూర్తయింది. కాస్టింగ్ ఎంపిక కూడా దాదాపు అయిపోయింది. కానీ చరణ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో తెలియక.. కాల్ షీట్స్ ఓకే చేయలేకపోతున్నారు. షెడ్యూళ్ల ప్లాన్ చేయట్లేదు.
‘గేమ్ చేంజర్’ పని అనుకున్నట్లుగా సాగకపోవడంతో చరణ్‌కు ఆ సినిమా మీదికి వెళ్లిపోవాలని శంకర్ మీద గౌరవంతో, దిల్ రాజు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఓపిక పడుతున్నాడు. ఐతే ఇటీవల జరిగిన డిస్కషన్ల ప్రకారం ఫిబ్రవరిలోపు ‘గేమ్ చేంజర్’ను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని, మార్చి నుంచి బుచ్చిబాబు సినిమాను మొదలుపెట్టి తీరాలని చరణ్ ఫిక్సయ్యాడట. ఈ మేరకు శంకర్‌కు సైతం స్పష్టంగా చెప్పేసినట్లు.. ఆయనకు డెడ్ లైన్ విధించక తప్పని పరిస్థితి నెలకొందని చరణ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on November 20, 2023 5:20 pm
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…