ఇప్పుడు భారతీయ ప్రేక్షకుల దృష్టంతా ‘యానిమల్’ సినిమా మీదే ఉంది. పేరుకు ఇది హిందీ సినిమానే కానీ సౌత్ ఇండియన్ ఆడియన్స్ సైతం ఈ చిత్రం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అందుక్కారణం.. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని రూపొందించడమే. మొదలైన దగ్గర్నుంచి ప్రత్యేక ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చిన ఈ చిత్రం.. ప్రి టీజర్, ఆ తర్వాత వచ్చిన టీజర్‌తో సంచలనం రేపింది.
దాదాపు ట్రైలర్ లాగా అనిపించిన టీజర్.. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అందులో కొన్ని షాట్లు.. డైలాగ్‌లు.. బ్యాగ్రౌండ్ స్కోర్.. రణబీర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక రకమైన గుబులు రేపాయి ప్రేక్షకుల్లో. సినిమా మీద అంచనాలను పతాక స్థాయికి తీసుకెళ్లింది టీజర్. ఐతే కథ అంతటితో అయిపోలేదని.. ట్రైలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలని సందీప్ రెడ్డి ఊరిస్తూ వస్తున్నాడు. ఎట్టకేలకు ట్రైలర్ డేట్ కూడా ఖరారైంది.
డిసెంబరు 1న ‘యానిమల్’ రిలీజవుతుండగా.. సరిగ్గా వారం ముందు, అంటే నంబరు 23న ట్రైలర్ రాబోతోంది. ఈ రోజు తాను, రణబీర్ ‘యానిమల్’ సెట్లో కలిసి ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘వర్త్ ద వెయిట్’’ అనే క్యాప్షన్‌తో ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు సందీప్. దీంతో ఒక్కసారిగా ‘యానిమల్’ ఫ్యాన్స్ అందరూ అలెర్టయ్యారు. టీజర్ తరహాలోనే సంచలనాత్మకంగా ట్రైలర్ ఉంటే.. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియా ఊగిపోవడం ఖాయం.
ట్రైలర్‌తో సందీప్ మెప్పిస్తే.. సినిమాకు హైప్ మరింత పెరుగుతుంది. డిసెంబరు 1న సినిమాకు మైండ్ బ్లోయింగ్ ఓపెనింగ్స్ రావడం ఖాయం. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. మిడ్ రేంజ్ స్ట్రెయిల్ మూవీ రేంజిలో రిలీజ్ ఉండబోతోంది. ఏ బాలీవుడ్ మూవీకి లేని స్థాయిలో ఓపెనింగ్స్ వస్తే ఆశ్చర్యం లేదు. ఇక నార్త్ ఇండియాలో సైతం సెన్సేషనల్ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on November 20, 2023 5:17 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…