ఒక సినిమాకు కేవలం మంచి టాక్ మాత్రమే సరిపోదు. ప్రి రిలీజ్ బజ్, సరైన రిలీజ్ టైమింగ్, ప్రమోషన్లు కూడా తోడవ్వాలి. అప్పుడే ఈ రోజుల్లో సినిమా బాక్సాఫీస్ సక్సెస్ సాధిస్తుంది. గత శుక్రవారం రిలీజైన ‘మంగళవారం’ సినిమాకు మిగతా అన్ని విషయాలూ కలిసొచ్చాయి కానీ రిలీజ్ టైమింగే కుదరలేదు. ప్రి రిలీజ్ బజ్ బాగానే తెచ్చుకున్న ఈ చిత్రానికి టీం ప్రమోషన్లు కూడా బాగానే చేసింది. ఇక రివ్యూలు, మౌత్ టాక్ కూడా బాగున్నాయి.
కానీ రాంగ్ టైమింగ్‌లో రిలీజ్ కావడం వసూళ్ల మీద తీవ్ర ప్రభావమే చూపింది. వన్డే ప్రపంచకప్‌లో ఇండియన్ టీం మునుపెన్నడూ లేనంత ఆధిపత్యం చలాయిస్తూ ఫైనల్‌కు చేరడం.. ఆ మ్యాచ్‌కు ఎక్కడా లేనంత హైప్ రావడం ‘మంగళవారం’ సినిమాకు బ్రేక్ వేసింది. తొలి రోజు ఓ మోస్తరు వసూళ్లు సాధించిన ‘మంగళవారం’ చిత్రానికి శని, ఆదివారాల వీకెండ్ కలెక్షన్లు కీలకం అయ్యాయి.
ఐతే ఆదివారం ఫైనల్ మ్యాచ్ అయితే.. ముందు రోజు నుంచే జనాలు క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోయారు. సామాజిక మాధ్యమాల్లోనే కాక బయట కూడా జనాల దృష్టంతా ఆ మ్యాచ్ మీదే ఉంది. దీంతో ‘మంగళవారం’ గురించి డిస్కషనే లేదు. నిజానికి ఈ సినిమాలోని బోల్డ్, సెన్సేషనల్ కంటెంట్‌కి మీడియాలో, సోషల్ మీడియాలో చాలా డిస్కషన్ జరగాలి. కానీ మ్యాచ్ వల్ల అలా జరగలేదు. శనివారం సాయంత్రం, నైట్ షోలకే ఆశించిన స్పందన లేదు. ఇక ఆదివారం సంగతి చెప్పాల్సిన పని లేదు.
కొత్త సినిమాలకు అత్యధిక వసూళ్లు వచ్చే ఈ రోజు.. ‘మంగళవారం’ అనే కాక అన్ని సినిమాల థియేటర్లు వెలవెలబోయాయి. కొన్ని థియేటర్లలో సందడి నెలకొందంటే అది మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం వల్లే. ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో ‘మంగళవారం’ కలెక్షన్లు మరీ దారుణంగా ఉన్నాయి. 50 లక్షల షేర్ కూడా రాని పరిస్థితి. వీకెండ్ ఇలా వృథా అయిపోగా.. జనాలు సోమవారం తమ పనుల్లో పడిపోయారు. దీనికి తోడు మ్యాచ్ ఓడిన బాధ వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో వీక్ డేస్‌లో ‘మంగళవారం’ ఏమాత్రం పుంజుకుంటుందన్నది సందేహంగానే ఉంది.
This post was last modified on November 20, 2023 5:14 pm
విజయ్ దేవరకొండ కెరీర్ ప్రస్తుతం ఎంత ఇబ్బందికరంగా ఉందో తెలిసిందే. లైగర్, ఫ్యామిలీ స్టార్ లాంటి భారీ డిజాస్టర్లతో అతను…
అవినీతి మకిలి అంటకుండా సాగితే…అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా కడుపులో చల్ల కదలకుండా నిర్భయంగా ఉండొచ్చు. అదే అవినీతిలో నిండా…
దేశంలోని మెజారిటీ ముస్లిం మైనారిటీలు వ్యతిరేకించిన వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రపతి ఈ బిల్లుపై…
ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ధనుష్ ఇడ్లి కడై (ఇడ్లి కొట్టు) ఏకంగా అక్టోబర్ కు వెళ్ళిపోయింది. ఆ నెల…
ఒకప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీని ఏలిన లెజెండరీ డైరెక్టర్ శంకర్.. కొన్నేళ్లుగా ఎంత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో తెలిసిందే. ఐ,…
ఏపీలో భారీ ఎత్తున జరిగిందని భావిస్తున్న మద్యం కుంభకోణంలో గురువార ఓ కీలక పరిణామం చోటుచేసుకోగా… ఆ మరునాడు శుక్రవారం…