సంక్రాంతి పోటీ ఎంత రసవత్తరంగా ఉండబోతోందో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. థియేటర్ల సర్దుబాటు, పోటీలో ఎవరుంటారు, ఎవరు తప్పుకుంటారనే దాని మీద రకరకాల విశ్లేషణలు జరుగుతూనే ఉన్నాయి. అందులో ఒకటి అల్లుడు వర్సెస్ తండ్రి కూతుళ్లు క్లాష్. ధనుష్ కెప్టెన్ మిల్లర్ డిసెంబర్ నుంచి తప్పుకుని జనవరి పొంగల్ పండక్కు వెళ్లడం ఇటీవలే ప్రకటించారు. తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ ప్యాన్ ఇండియా మూవీలో ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటించగా శివ రాజ్ కుమార్ తదితరులు కీలకలు పాత్ర పోషిస్తున్నారు.
ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందిన లాల్ సలామ్ ని సంక్రాంతికే తీసుకొస్తున్నట్టు కొద్దిరోజుల క్రితమే అనౌన్స్ చేశారు. ఇందులో ఆమె తండ్రి కం సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ కీలక పాత్ర పోషించారు. ధనుష్, ఐశ్వర్య విడాకులు చట్టపరంగా తీసుకోలేదన్న మాటే కానీ ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఏదైనా ఫంక్షన్ జరిగినా కలవడం లేదు. మళ్ళీ కలుస్తారనే ప్రచారం జరిగింది కానీ ప్రస్తుతానికి ఆ సూచనలు లేవు. సో ధనుష్ తో ఐశ్వర్య, రజనిలు బాక్సాఫీస్ యుద్ధంలో ఫేస్ టు ఫేస్ తలపడేందుకు రెడీ అయ్యారన్న మాట. ఇది జస్ట్ కాకతాళీయమని చెప్పడానికి లేదు.
ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా ఒకేసారి విడుదల కాబోతున్నాయి. ఇంకా హక్కుల వ్యవహారాలు పూర్తి కాలేదు కానీ సరిపడా స్క్రీన్లు దొరికినా దొరక్కపోయినా ఒకేసారి రిలీజ్ చేయాలనే ప్లాన్ తో ఉన్నారు నిర్మాతలు. ధనుష్, ఐశ్వర్యలలో ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ మిల్లర్ మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇంకోవైపు లాల్ సలామ్ టీజర్ పెద్దగా హైప్ పెంచలేకపోయింది. విష్ణు విశాల్ హీరో కావడం, రజని ముస్లిం గెటప్ హీరోయిజం యాంగిల్ లో అంతగా ఎలివేట్ కాకపోవడం పలు అనుమానాలు లేవనెత్తింది. చూడాలి ఈ క్లాష్ ఎలా ఉండతోందో.
This post was last modified on November 20, 2023 1:44 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…