టాలీవుడ్ లో థ్రిల్లర్ ప్లస్ హారర్ ట్రెండ్ బాగా నడుస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకు దీన్నో కామెడీ జానర్ లాగా మార్చేసిన లారెన్స్ లాంటి వాళ్ళు కమర్షియల్ సినిమాలకు షిఫ్ట్ కావడంతో మళ్ళీ సీరియస్ కథలకు డిమాండ్ వచ్చింది. విరూపాక్ష సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే పెద్ద హిట్టు కొట్టింది. ఓటిటి మూవీకి కొనసాగింపుగా వచ్చిన మా ఊరి పొలిమేర 2 థియేట్రికల్ రిలీజ్ కు రిస్క్ చేసి ఇరవై కోట్ల గ్రాస్ కు దగ్గరగా వెళ్లి, బయ్యర్లు నిర్మాత నమ్మకాన్ని రెట్టింపు స్థాయిలో నిలబెట్టింది. తాజాగా మంగళవారం తను టార్గెట్ చేసుకున్న ప్రేక్షకులను సంతృప్తి పరుస్తూ సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.
దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే ఎంటర్ టైన్మెంట్ లేకపోయినా కుర్చీలో కదలకుండా ఆసక్తి రేపెలా కథలు చెబితే ఆడియన్స్ థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. స్టార్లు, పాటలు పెద్దగా లేకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ ఈ సిరీస్ లో ఊరి పేరు భైరవకోన రెడీగా ఉంది. అనిల్ సుంకర నిర్మాణ భాగస్వామ్యంతో విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందింది. సందీప్ కిషన్ హీరోగా తీసిన ఈ సినిమా కూడా ఒక గ్రామం, దాని చుట్టూ అంతు చిక్కని ఒక మిస్టరీ, చేధించడానికి వచ్చిన హీరో ఈ తరహాలో సాగుతుంది. కానీ టీమ్ మాత్రం ఊహించని అంశాలు చాలా ఉంటాయని చెబుతున్నారు.
విడుదల తేదీ నిర్ణయించుకోవడంలో ఊరిపేరు భైరవకోన కిందా మీద పడుతోంది. బడ్జెట్ పాతిక కోట్ల దాకా అయ్యిందట. అంత రికవరీ కావాలంటే బ్లాక్ బస్టర్ కు తగ్గకుండా ఆడాలి. కంటెంట్ మీద నమ్మకముంది కానీ సందీప్ కిషన్ మీద అంత బిజినెస్ జరిగే పరిస్థితి లేదిప్పుడు. అందుకే స్వంతంగా రిలీజ్ చేసుకోవాల్సి రావొచ్చు. పైగా ఫిబ్రవరి దాకా డేట్లు లేవు. అప్పటిదాకా ఎదురుచూడాలంటే వడ్డీలు పెరిగిపోతాయి. ఇటీవలే ప్రమోషన్లు రీ స్టార్ట్ చేశారు కానీ ముందు విడుదలతేదీ ప్రకటించాలి. దానికన్నా ముందు హక్కులను అమ్మాలి. చూస్తుంటే ఫిబ్రవరి తప్ప అంతకు ముందు వచ్చే సూచనలు పెద్దగా లేవు.
This post was last modified on November 19, 2023 3:01 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…