రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం స్థాయి ఉన్న సినిమాలకు తొలి వారం అదనపు షోలు వేసుకోవడానికి, రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలకు విన్నపాలు పెట్టుకోవడం.. అక్కడ్నుంచి అనుమతులు రావడం మామూలే. మధ్యలో ఆంధ్రప్రదేశ్ వరకు కొంచెం ఇబ్బంది తలెత్తింది కానీ.. తర్వాత చాలా వరకు సినిమాలకు అనుమతులు సులువుగానే వచ్చేస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘బ్రో’కు మాత్రం నిర్మాతలు అదనపు రేట్లే అడగలేదు.
పవన్‌కు, ఏపీ అధికార పార్టీతో ఉన్న కయ్యం తెలిసిందే కాబట్టి నిర్మాతలే తమకు తాముగా ఈ విషయంలో నియంత్రించుకుని ఉండిపోయారు. ఐతే తమకు అనుకూలంగా లేని హీరోలు, దర్శక నిర్మాతలను ఈ విషయంలో ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో ప్రయత్నించింది. ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’కు అప్పట్లో కొంత ఇబ్బంది తప్పలేదు. ‘ఆదిపురుష్’కు అలాంటి సమస్యేమీ లేకపోయింది.
ఐతే అదనపు షోలు, రేట్ల కోసం సాధారణంగా రిలీజ్ వీక్‌లోనే ప్రయత్నాలు జరుగుతుంటాయి. కానీ ప్రభాస్ కొత్త చిత్రం ‘సలార్’ విషయంలో మాత్రం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్స్ ప్లానింగ్‌లో ఉన్నారు. విడుదలకు నెల రోజుల ముందే ఇందుకోసం అప్లికేషన్లు పెట్టేశారట. 50 నుంచి 75 రూపాయల మేర టికెట్ల ధరలు పెంచుకునే సౌలభ్యం కల్పించాలని.. ఐదు షోలకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాలకు విన్నవించుకున్నారట.
రిలీజ్ టైంలో హడావుడి లేకుండా ఇప్పుడే ఈ పని పూర్తి చేయాలని భావించినట్లున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా ముందుగానే మొదలుపెట్టాలని.. అందుకే ఇప్పుడే రేట్లు ఖరారైపోతే మంచిదని చూస్తున్నారట. కొన్ని రోజుల్లోనే అనుమతులు వచ్చేస్తాయని.. విడుదలకు పది రోజుల ముందే బుకింగ్స్ మొదలైపోతాయని అంటున్నారు.
This post was last modified on November 18, 2023 7:28 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…