ఫిలిం సెలబ్రెటీల గురించి మీడియాలో.. సోషల్ మీడియాలో అనేక పుకార్లు వస్తుంటాయి. వాటన్నింటి గురించి వాళ్లు పట్టించుకోవడం మొదలుపెడితే అంతే సంగతులు. అందుకే చాలా వరకు వీటిని లైట్ తీసుకుని ముందుకు వెళ్లిపోతుంటారు సెలబ్రెటీలు. కానీ వ్యక్తిగత విషయాల మీద పదే పదే టార్గెట్ చేస్తే మాత్రం ఎలాంటి వాళ్లకైనా బాధ వేస్తుంది.
ఏదో ఒక దశలో బరస్ట్ అవుతారు. మీడియా, సోషల్ మీడియా వార్తలను చాలా తేలిగ్గా తీసుకునేట్లు కనిపించే ఆలియా భట్ సైతం కొన్ని విషయాల్లో తన గురించి వచ్చే రూమర్లు చూసి చాలా బాధ పడిందట. ముఖ్యంగా తన వ్యక్తిగత విషయాలు, భర్త రణబీర్ కపూర్‌తో రిలేషన్ విషయంలో వచ్చే వార్తలు తనను బాధ పెట్టాయని కాఫీ విత్ కరణ్ షోలో ఆమె వెల్లడించింది.
గతంలో కాఫీ విత్ కరణ్ షోలో తాను మాట్లాడుతూ.. రణబీర్‌కు తాను లిప్‌స్టిక్ వేస్తే నచ్చదని, వెంటనే తీసేయమంటాడని చెప్పానని.. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుని తనను అతను వేధిస్తున్నాడంటూ వార్తలు రాశాడని.. ఇది తననెంతో బాధించిందని ఆలియా చెప్పింది. రణబీర్ చాలా మంచి వ్యక్తి అని.. అతను తననెంతో బాగా చూసుకుంటాడని ఆమె వ్యాఖ్యానించింది.
తన వైవాహిక జీవితంలో సమస్యలున్నట్లు చాలాసార్లు రూమర్లు క్రియేట్ చేశారని.. ఒకప్పుడు బాధ పడ్డా తర్వాత పట్టించుకోవడం మానేశానని ఆమె అంది. తాను కొవ్వు తగ్గించుకుని సన్నగా మారడం కోసం.. అలాగే తన చర్మాన్ని తెల్లగా చేసుకోవడం కోసం సర్జరీలను ఆశ్రయించానని కూడా ప్రచారం చేశానని.. ఈ ఇంటర్నెట్ యుగంలో ఇలాంటి రూమర్లు వస్తూనే ఉంటాయని.. వీటిని తేలిగ్గా తీసుకుని ముందుకు వెళ్లిపోవాల్సిందే అని ఆలియా అభిప్రాయపడింది.
అక్కినేని నాగచైతన్యకు చాలా కాలానికి ఓ మంచి హిట్ పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. థాంక్యూ, కస్టడీ లాంటి డిజాస్టర్ల తర్వాత…
మన దగ్గరేమో ప్యాన్ ఇండియా సినిమాలు విపరీతమైన ఆలస్యాలకు లోనవుతూ, విడుదల తేదీలు మార్చుకుంటూ నానా తిప్పలు పడుతున్న వైనాన్ని…
నిజమే... జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ఒక్కటంటే ఒక్క మాటతో ఆ రెండు గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. మరికొన్నాళ్లుంటే...…
కంటెంట్ కన్నా ఎక్కువ వివాదాలతో వార్తల్లో నిలిచిన లూసిఫర్ సీక్వెల్ ఎంపురాన్ 2 తాజాగా ఇరవైకి పైగా కత్తిరింపులు, రెండు…
గత ఏడాది డిసెంబర్లో విడుదలై ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప 2 ది రూల్ కొనసాగింపు పుష్ప…
తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. పరీక్ష మొదలైన…