ఈ ఏడాది ఇండియా మొత్తంలో భారీ హైప్ తెచ్చుకున్న సినిమాల్లో ‘లియో’ ఒకటి. పేరుకు ఇది తమిళ సినిమానే అయినా.. తెలుగులో కూడా స్ట్రెయిట్ సినిమా స్థాయిలో బంపర్ క్రేజ్ తెచ్చుకుంది. హిందీలో సైతం ‘లియో’కు హైప్ వచ్చింది. కానీ అంచనాలను అందుకోవడంలో ‘లియో’ ఘోరంగా విఫలమైంది. ‘విక్రమ్’ తర్వాత లోకేష్ కనకరాజ్ తీసిన సినిమా కావడంతో ఎంతో ఊహించుకుని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు దిమ్మదిరిగిపోయింది.
సిల్లీ కథను బోరింగ్‌గా నరేట్ చేసి ప్రేక్షకులకు షాకిచ్చాడు లోకేష్. ప్రి రిలీజ్ హైప్ వల్ల సినిమాకు ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. తర్వాత నిలబడలేకపోయింది. తెలుగులో తొలి వీకెండ్ తర్వాత ‘లియో’కు సౌండే లేదు. తమిళనాడు మినహా ఎక్కడా ఈ సినిమా నిలబడలేదు. తమిళంలో మాత్రం వేరే ఆప్షన్ లేక దసరా టైంలో ఈ సినిమానే చూశారు ప్రేక్షకులు.
ఐతే సినిమా సాధించిన వసూళ్ల కంటే ఎక్కువ చూపించి ఫేక్ చేశారనే చర్చ రిలీజ్ టైంలో నడిచింది. బుకింగ్స్‌ను కూడా మేనేజ్ చేశారంటూ అనేక వివాదాలు చుట్టుముట్టాయి. మొత్తానికి రెండు మూడు వారాల తర్వాత ‘లియో’ హడావుడికి తెరపడింది. ఈ సినిమా గురించి అందరూ మరిచిపోయారు. కానీ ఇప్పుడు ‘లియో’ను తమిళనాట రీ రిలీజ్ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి.
గత రెండు వారాల్లో వచ్చిన తమిళ సినిమాలు పెద్దగా ఆడలేదు. థియేటర్లు వెలవెలబోతున్నాయి. కొత్త సినిమాల కోసం ‘లియో’ను నెమ్మదిగా థియేటర్ల నుంచి లేపేశారు. ఆ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసిందనే అనుకున్నారంతా. కానీ ఇప్పటికే రిలీజైన సినిమాలకు వసూళ్లు లేకపోగా.. కొత్త చిత్రాలకూ సరైన స్పందన కనిపించకపోవడంతో ‘లియో’ను తిరిగి వంద థియేటర్లలో రిలీజ్ చేయడానికి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు సన్నాహాలు చేస్తునన్నారట. నెగెటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర సరిగా పెర్ఫామ్ చేయలేకపోయిన సినిమాను ఇంత తక్కువ గ్యాప్‌లో మళ్లీ రిలీజ్ చేయడమేంటో అర్థం కాక జనాలు తలలు పట్టుకుంటున్నారు.
This post was last modified on November 17, 2023 3:41 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…