ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ థియేటర్లోనే కాదు ఓటిటిలో వస్తున్నప్పుడు కూడా ఒక రకమైన హడావిడి చూస్తుంటాం. కానీ టైగర్ నాగేశ్వరరావు గుట్టుచప్పుడు కాకుండా నిన్న అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావడం చూసి అభిమానులే ఆశ్చర్యపోయారు. మాములుగా ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీకి ప్రైమ్ చేసే ప్రమోషన్లు ఓ రేంజ్ లో ఉంటాయి. సోషల్ మీడియాని వేదికగా మార్చుకుని ఆడియన్స్ ని సిద్ధం చేస్తుంది. కానీ దీని విషయంలో అలాంటిదేమీ చేయకపోవడం విచిత్రం. కేవలం 28 రోజుల నిడివి అంటే నాలుగు వారాల గ్యాప్ తో వచ్చేయడం విశేషం.
దసరా చిత్రాల్లో ఓటిటిలో ముందుగా ప్రత్యక్షమయ్యింది టైగర్ నాగేశ్వరరావే. వాస్తవానికి లియోని నెట్ ఫ్లిక్స్ నిన్న 16న విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంది. కానీ ఎందుకో మళ్ళీ మనసు మార్చుకుని 21కి వాయిదా వేసింది. భగవంత్ కేసరి హక్కులు కొన్నది ప్రైమే కాబట్టి టైగర్ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చేలా బహుశా వచ్చే వారం అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయి. ఇటీవలే నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ టైగర్ నాగేశ్వరరావు బిజినెస్, రెవిన్యూ కోణంలో తమకు మంచి లాభాలు వచ్చాయని, అలాంటప్పుడు ఫ్లాప్ అనే ముద్ర ఎలా వేస్తారని ప్రశ్నించడం చర్చకు దారి తీసింది.
అయినా ఇలా సౌండ్ లేకుండా రావడం మాత్రం అనూహ్యమే. ఇంకో ట్విస్టు ఏంటంటే ఓటిటిలో అన్ కట్ వెర్షన్ (కత్తిరింపులు లేకుండా) వస్తుందేమోనని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. థియేటర్లో మొదటి రెండు రోజులు చూసిన మూడు గంటల రెండు నిమిషాల ప్రింట్ కి బదులు తర్వాత ఎడిట్ చేసిన 2 గంటల 43 నిమిషాల వెర్షనే వదిలారు. సో ఇంకెప్పటికీ కోతకు గురైన నాగేశ్వరరావు భాగాన్ని చూడలేమన్న మాట. వంశీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన టైగర్ నాగేశ్వరరావు యాభై కోట్ల గ్రాస్ అందుకున్నప్పటికీ బ్రేక్ ఈవెన్ కి దూరంలో నిలిచిపోయి చివరికి ఫ్లాప్ గా మిగిలింది.
This post was last modified on November 17, 2023 10:18 am
ఈ వారం విడుదల కాబోతున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో క్లైమాక్స్ గురించి టీమ్ పదే పదే హైలైట్ చేస్తూ చెప్పడం…
నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ మ్యాచ్ చూసి క్రికెట్ అభిమానులు ఊగిపోయారు. ముఖ్యంగా అభిషేక్…
గత ఏడాది విశ్వంభర టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ ఏ స్థాయిదో మళ్ళీ గుర్తు చేయనక్కర్లేదు. అందుకే నెలల తరబడి…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2…
తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…