గత కొన్నేళ్లలో టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటి ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మొత్తంలోనూ అత్యంత చేదు అనుభవం మిగిల్చిన సినిమాల్లో అది ముందు వరసలో ఉంటుంది. ఆ పేరు ఎత్తితేనే మెగా అభిమానులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డ భావన కలుగుతుంది. ఎప్పటికీ మరిచిపోలేని చేదు అనుభవం ఆ చిత్రం. మెగా ఫ్యామిలీ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రం ఆదికేశవ టీజర్ రిలీజైనపుడు.. దానికి ఆచార్యతో పోలికలు కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు మెగా అభిమానులు.
అందులో హీరో ఆలయాన్ని కాపాడే రక్షకుడి తరహా పాత్రలో కనిపించడంతో అభిమానుల్లో కలవరం తప్పలేదు. సోషల్ మీడియాలో ఈ సినిమా పట్ల నెగెటివిటీ రావడానికి ఈ పోలిక కారణమైంది. ఈ పోలిక, ఈ చర్చ ఆదికేశవ టీంను కూడా భయపెట్టిందట. ఈ విషయంపై దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడాడు.
ఇది ఆలయాన్ని కాపాడే హీరో కథ కాదు. ఈ సినిమాలో అంతర్లీనంగా శివుడి గురించి ప్రస్తావించాలని అనుకున్నామంతే. ఇందులో గుడికి సంబంధించిన సన్నివేశాలు ఓ పది నిమిషాల కంటే తక్కువే ఉంటాయి. ఆ సన్నివేశాలతో కూడిని గ్లింప్స్‌తో ప్రచారం మొదలుపెడితే బాగుంటుందని అనుకున్నాం. కానీ దాన్ని చూసి కొందరు ఆచార్య సినిమాతో పోలిక పెట్టారు.
అప్పుడు కొంచెం భయపడ్డాం. ఈ సినిమాను వేరే కోణంలో చూస్తున్నారని అనిపించింది. కానీ మా సినిమా ఎలా ఉంటుందన్నది ట్రైలర్ చూశాక అర్థమవుతుంది అని శ్రీకాంత్ రెడ్డి తెలిపాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో రూపొందిన ఆదికేశవ ఈ నెల 10నే రిలీజ్ కావాల్సింది. కానీ అప్పుడు పోటీ, ప్రపంచకప్ ఫీవర్‌ను దృష్టిలో ఉంచుకుని 24వ తేదీకి వాయిదా వేశారు. ఇందులో వైష్ణవ్ సరసన శ్రీలీల నటించింది.
This post was last modified on November 17, 2023 9:16 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…