ఇటీవలే లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుని బ్రహ్మచారి జీవితానికి స్వస్తి పలికిన మెగా హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమా ఆపరేషన్ వాలెంటైన్ డిసెంబర్ 8 విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటిదాకా యాక్టివ్ ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. మానుషీ చిల్లార్ హీరోయిన్ గా నటించిన ఈ ఎయిర్ స్పేస్ డ్రామాని సోనీ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. హాయ్ నాన్న, ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ లతో పోటీ ఉన్న నేపథ్యంలో పబ్లిసిటీ పరంగా దూకుడుగా ఉంటే తప్ప జనాన్ని థియేటర్ల దగ్గరకు రప్పించలేం. అలాంటిది వాలెంటైన్ బృందం ఇంత మౌనంగా ఉండటం అనుమానాలకు తెరతీస్తోంది.
అసలే వరుణ్ మార్కెట్ ఏమంత ఆశాజనకంగా లేదు. గని, గాండీవధారి అర్జున దారుణమైన డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో మెగా ఫ్యాన్స్ నుంచే సరైన మద్దతు లేక ఓపెనింగ్స్ చాలా తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇంగ్లీష్ టైటిల్ పెట్టుకుని, మాస్ కి కనెక్ట్ చేయడం చాలా కష్టమనించే జానర్ ని ఎంచుకుని పెద్ద రిస్క్ చేస్తున్నారు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ మనోడు కాదు. ఇన్ని ప్రతికూలతల మధ్య హైప్ తేవడం అంత సులభం కాదు . ఇంకో వైపు న్యాచురల్ స్టార్ తన హాయ్ నాన్న కోసం ఇంటర్వ్యూలు మొదలుపెట్టేశాడు. నాని నుంచి మూడు, నితిన్ నుంచి రెండు లిరికల్ వీడియోలు వచ్చేశాయి.
ఒకవేళ ఆపరేషన్ వాలెంటైన్ ఏదైనా వాయిదా ఆలోచన చేస్తుందేమో వీలైనంత త్వరగా డిసైడ్ చేసుకుంటే మంచిది. అయితే సోనీ సంస్థ పోస్ట్ పోన్ పట్ల అంత సుముఖంగా లేదట. డిజిటల్ అగ్రిమెంట్లు జరిగిపోయాయి కాబట్టి ఇప్పుడా ఛాన్స్ లేదని, ఉన్న ఇరవై రోజుల్లో వీలైనంత ప్రచారం చేసుకునేందుకు టీమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇంకో రెండు మూడు రోజుల్లో ప్రకటన రాకపోతే దీన్నే నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తప్పని పరిస్థితిలో తప్పుకోవాల్సి వస్తే మాత్రం నాని, నితిన్ లకు ఇంకాస్త ఎక్కువ స్క్రీన్లు దక్కుతాయి. వీటిలో పాటు రావాల్సిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి డిసెంబర్ నెలాఖరుకు వెళ్లొచ్చని టాక్.
This post was last modified on November 16, 2023 12:19 pm
బాలీవుడ్ లో బేబీ జాన్ తో అడుగు పెట్టిన కీర్తి సురేష్ కి తొలి సినిమానే డిజాస్టర్ కావడం నిరాశపరిచేదే…
అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ…
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…