ఒకప్పుడు హీరో అంటే మొహం మీద మీసం తప్ప క్లీన్ షేవ్ తో కనిపిస్తేనే అందగాడనే కోణంలో చూసేవాళ్ళు. కాలం చేసిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి శోభన్ బాబు, కృష్ణ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ దాకా అందరూ ఇదే ఫాలో అవుతూ అభిమానులను అలరించేవాళ్ళు. కమల్ హాసన్ లాంటి విలక్షణ నటులు మాత్రమే దీనికి మినహాయింపుగా నిలిచి ప్రయోగాలు చేసేవాళ్ళు. మిగిలిన బ్యాచ్ మాత్రం కథ ఎంతో డిమాండ్ చేస్తే తప్ప గెడ్డం గెటప్ ఉండేది కాదు. కానీ కొత్త జనరేషన్ లో బారుడు గెడ్డం ఒక హిట్ ఫార్ములాగా మారిపోయి చిన్నా,పెద్దా తేడా లేకుండా ఒక రకమైన ట్రెండ్ ని సెట్ చేస్తోంది.
రంగస్థలం రామ్ చరణ్, పుష్ప అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ పంజా, నాన్నకు ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్, కెజిఎఫ్ యష్, కాంతార రిషబ్ శెట్టి, అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ, భీమ్లా నాయక్ రానా, తొలిప్రేమ వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ చిత్రలహరి, ప్రభాస్ సలార్, ధమాకా రవితేజ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. విశ్వక్ సేన్, కార్తికేయ లాంటి అప్ కమింగ్ హీరోలు సైతం ఇదే బాట పడుతున్నారు. మహేష్ బాబు, నిఖిల్ లాంటి ఒకరిద్దరు మాత్రమే దీనికి మినహాయింపుగా నిలిచారు కానీ టక్కరి దొంగ, అర్జున్ సురవరం లాంటి వాటిలో వీళ్ళు కూడా గెడ్డం బాట పట్టిన హీరోలే.
దీన్ని బట్టే మొహంలో గెడ్డం ఎంత హీరోయిజం ఎలివేషన్ కి పనికొస్తోందో అర్థం చేసుకోవచ్చు. సౌత్ లోని ఇంత భాషల్లోనూ ఇదే ధోరణి గమనించవచ్చు. ధనుష్, మమ్ముట్టి, మోహన్ లాల్ ఎప్పటి నుంచో గెడ్డానికి అలవాటు పడినవాళ్ళే. ఇది కేవలం సెంటిమెంటని చెప్పడం లేదు. ఒకప్పుడు మగాడి వ్యక్తిత్వాన్ని బేరీజు వేయడానికి అతను గెడ్డం చేసుకున్నాడో లేదో అని చెక్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడేమో పెంచుకుంటేనే తెరమీద పురుషుడి పరిపూర్ణత అన్న రేంజ్ లో దర్శకులు క్యారెక్టర్లు రాస్తున్నారు. అంతే మరి కాలానికి తగ్గట్టు జనరేషన్ కోరుకున్నట్టు హీరోలు తమ స్టైల్ ని ఈ రకంగా సెట్ చేసుకోవాల్సిందే.
This post was last modified on November 15, 2023 3:28 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…