ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు కంకణం కట్టుకున్న ఫ్యామిలీ స్టార్ కి ఆ టార్గెట్ ని చేరుకోవడంలో గట్టి చిక్కులే ఎదురవుతున్నాయి. కీలకమైన ఫారిన్ షెడ్యూల్ ఒకటి పెండింగ్ ఉండిపోవడంతో దానికి సంబంధించిన పనులు వేగంగా జరగడం లేదని ఇన్ సైడ్ టాక్. ముందు బ్యాంకాక్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇంతలో వీసాల సమస్య వచ్చిందట. అందుకే అమెరికా వెళ్లాలని చూస్తున్నారట. అయితే ఇదీ అంత తేలిగ్గా జరిగే వ్యవహారం కాదు కాబట్టి దర్శకుడు పరశురామ్ బృందం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోందని వినికిడి. ఖచ్చితంగా తెలియాల్సి ఉంది.
ఒకవేళ ఈ జాప్యం ఇంకాస్త ఎక్కువైతే జనవరిలో రావడం కష్టమవుతుంది. ఫ్యామిలీ స్టార్ టీజర్ ఆ మధ్య పబ్లిక్ లోకి బాగానే వెళ్ళింది. రౌడీ హీరో మీద వచ్చిన నెగటివ్ ట్రోల్స్ కాస్తా ఐరన్ వంచాలా ఏంటి ట్రెండ్ తో పాజిటివ్ గా మారిపోయాయి. ఈ నేపథ్యంలో వీలైనంత హైప్ ని నిర్మించే క్రమంలో ఎస్విసి టీమ్ కొత్త తరహా ప్రమోషన్లు ప్లాన్ చేస్తోంది. చేతిలో కేవలం రెండు నెలల సమయం ఉంది. లక్ష్యాన్ని మిస్ కాకూడదనే ఉద్దేశంతో పరశురామ్ ప్రత్యేకంగా ఒక ఎడిటింగ్ రూమ్ ని సిద్ధం చేయించి మరీ పనులు వేగవంతం చేశాడు. ఇంకా బాలన్స్ ఉన్న షూట్ తాలూకు వర్క్ విడిగా చేయాల్సి ఉంటుంది.
ఇంత ఒత్తిడి మధ్య బిజినెస్ వ్యవహారాలు, థియేటర్ అగ్రిమెంట్లు, స్క్రీన్ల పంపకాలు, ప్రమోషన్ స్ట్రాటజీలు, ట్రైలర్ ఈవెంట్లు, ప్రీ రిలీజ్ వేడుకలు ఇలా బోలెడు వ్యవహారాలు పెండింగ్ ఉంటాయి. గుంటూరు కారం కూడా ఇంచుమిందు ఇదే స్టేజిలో ఉంది కాబట్టి వాళ్లే పూర్తి చేయగలమని అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు తామెందుకు టెన్షన్ పడాలన్నది ఫ్యామిలీ స్టార్ ఆలోచన కావొచ్చు. ఏది ఏమైనా సంక్రాంతికి విజయ్ దేవరకొండ ఖచ్చితంగా వస్తాడా రాడా అనేది పైన చెప్పిన వాటి మీద ఆధారపడేలా ఉంది. యూనిట్ సభ్యులు మాత్రం వెనక్కు తగ్గేది ఉండదనే అంటున్నారు. చూడాలి మరి.
This post was last modified on November 14, 2023 6:46 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…