Movie News

జాతర గురించి బన్నీ చెప్పింది తక్కువే

నిన్న జరిగిన మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ తన ప్రసంగంలో పుష్ప 2 ప్రస్తావన తేవడంతో ఒక్కసారిగా అభిమానుల్లో జోష్ వచ్చింది. రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని, నేరుగా అక్కడి నుంచే వస్తున్నానని చెప్పాడు. జాతర్ ఎపిసోడ్ గురించి హింట్ చేస్తూ చేతికి ఉన్న నైల్ పాలిష్ తో పాటు ఈ గెటప్ కు సంబంధించిన గుర్తులు అలాగే ఉండిపోయాయని చూపించాడు. పుష్ప 2లో ఇది చాలా కీలకమైన ట్విస్ట్. ఫస్ట్ లుక్ పోస్టర్ లో బన్నీ ఆడవేషం వేసింది ఇందులో భాగంగానే. అయితే మ్యాటర్ ఇక్కడితో అయిపోలేదు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం జాతర గురించి బన్నీ చెప్పింది చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే అసలేం రివీల్ చేయలేదు. వందలాది జూనియర్ ఆర్టిస్టుల మధ్య అల్లు అర్జున్ గ్రామ సంప్రదాయం ప్రకారం వేషం వేసుకుని పాటకు డాన్స్ చేస్తూ, ఊగిపోతూ శత్రు సంహారం చేయడం పూనకాలు వచ్చే రేంజ్ లో దర్శకుడు సుకుమార్ తీస్తున్నాడట. సరిగ్గా పేలి ఆడియన్స్ కి కనెక్ట్ అయితే థియేటర్ జనాలు ఊగిపోవడం ఖాయమని తెగ ఊరిస్తున్నారు. డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య కంపోజింగ్ కూడా అంతే స్థాయిలో గూస్ బంప్స్ ఇచ్చే స్థాయిలో వచ్చిందని లీకుల ప్రధాన సారాంశం.

ఇది ఇంటర్వెల్ కు వస్తుందా లేక క్లైమాక్స్ ఘట్టమా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రధాన తారాగణం పాల్గొనే ఈ ఎపిసోడ్ గురించి చాలా కాలం మాట్లాడుకుంటారని ఊరిస్తున్నారు. సెట్ లో విన్నవాళ్ళు దేవీశ్రీ ప్రసాద్ విశ్వరూపం మరోసారి చూడొచ్చని అంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఫ్యాన్స్ ఇంకా వచ్చే ఏడాది ఆగస్ట్ 15 దాకా ఎదురు చూడాల్సి రావడం వాళ్లకు మహా కష్టంగా ఉంది. ప్రమోషన్ కూడా ఏప్రిల్ తర్వాతే చేస్తారట. షూటింగ్ కి ఎప్పుడు గుమ్మడకాయ కొడతారనేది ఇప్పట్లో తేలదు. క్వాలిటీ విషయంలో రాజీ పడని సుకుమార్ మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేసేస్తున్నారు. 

This post was last modified on November 12, 2023 1:18 pm

Share

Recent Posts

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…

16 minutes ago

నిర్మాత రిస్క్ చేశాడు… జాక్‌పాట్ కొడుతున్నాడు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంత‌కుముందులా ఉదారంగా కొత్త సినిమాల‌ను కొన‌ట్లేద‌న్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫ‌ర్…

32 minutes ago

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

4 hours ago

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

9 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

13 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

14 hours ago