వచ్చే ఏడాది ఏప్రిల్ 5 విడుదల తేదీని దేవర నెలల ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండో భాగం ఎప్పుడనేది చెప్పలేదు కానీ ఫస్ట్ పార్ట్ ఆ డేట్ కే వచ్చేలా దర్శకుడు కొరటాల శివ, హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ పట్టుదలగా షూటింగ్ జరుపుతున్నారు. అనిరుద్ రవిచందర్ సహకరించి టైంకి పాటలు ఇచ్చేస్తే ఓ పెద్ద టెన్షన్ తీరిపోతుంది. జాన్వీ కపూర్ తో పాటు ఇతర తారాగణం పాల్గొన్న కీలక భాగాలను ఇటీవలే ఒక కీలక షెడ్యూల్ లో పూర్తి చేసుకుని హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. పోటీ పరంగా దేవర ఇప్పటిదాకా ఎలాంటి రిస్క్ లో లేదనే యంగ్ టైగర్ ఫ్యాన్స్ భావిస్తూ వస్తున్నారు.
ట్విస్ట్ ఏంటంటే దేవర వచ్చిన సరిగ్గా వారానికే సూర్య ప్యాన్ ఇండియా మూవీ కంగువాని ఏప్రిల్ 11 రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు కోలీవుడ్ బయ్యర్స్ టాక్. అధికారికంగా ప్రకటించకపోయినా అడ్వాన్స్ కోసం తమను కలిసిన డిస్ట్రిబ్యూటర్లతో ఈ మాట అఫ్ ది రికార్డు చెప్పారట. రేపో ఎల్లుండో ప్రకటన వచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే అదే తేదీకి కమల్ హాసన్ భారతీయుడు 2 (ఇండియన్ సీక్వెల్) ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఇంకో వార్త చక్కర్లు కొడుతోంది. ఏపీలోనే షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్న శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కబురు వచ్చేస్తుంది.
దేవరలో ఎంత బలమైన కంటెంట్ ఉన్నా కేవలం వారం గ్యాప్ లో కంగువా, ఇండియన్ 2 రావడం బయట రాష్ట్రాల మార్కెట్ కోణంలో అంత సేఫ్ కాదు. ఎందుకంటే కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పైగా టాక్స్ కీలక పాత్ర పోషించే ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ హీరోలు పెట్టుబడిని రికవర్ చేయాలంటే వీలైనంత కాంపిటీషన్ లేకుండా చూసుకోవాలి. దేవరకు ఎదురు నిలిచేది డబ్బింగ్ సినిమాలే కదాని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. వాటి మీద హైప్ మన దగ్గరా భారీగా ఉంది. సో అనౌన్స్ మెంట్లు వచ్చే దాకా ఈ పద్మవ్యూహం చిక్కు సస్పెన్స్ గానే ఉండబోతోంది.