ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు గత ఏడాది మొదలుపెట్టిన కొత్త సినిమాకు సుధీర్ బాబు హీరో అని.. అందులో నాని అతిథి పాత్ర లాంటిది చేస్తున్నాడని ముందు వార్తలొచ్చాయి. చిత్ర బృందం కూడా ఇలాంటి సంకేతాలే ఇచ్చింది. కానీ తర్వాత చూస్తే ఇందులో నానీదే డామినేషన్ అని అర్థమైంది.
అతను నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నప్పటికీ.. ‘హీరో’ పాత్రధారి సుధీరే అయినప్పటికీ.. సినిమాలో ఓవరాల్‌గా హైలైట్ అయ్యేది మాత్రం నానీనే అని స్పష్టమైపోయింది. ప్రమోషన్లంతా కూడా నానీని హైలైట్ చేస్తూనే సాగాయి. నాని 25వ సినిమా అని పోస్టర్ మీద వేసి ఇది అతడి సినిమాగానే ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది చిత్ర బృందం. సుధీర్‌తో పోలిస్తే నాని మార్కెట్ ఎక్కువ కాబట్టి అతడిని ముఖచిత్రంగా పెడితేనే సినిమాకు మార్కెట్ అవుతుందన్న ఉద్దేశంతో ఇలా చేసి ఉండొచ్చు.
ఐతే ఈ సినిమాతో సుధీర్ బాబుకు వచ్చే ప్రయోజనం ఏంటి.. అతను ఏ రకంగా సినిమాలో హైలైట్ అవుతాడు అనే ప్రశ్న చాలామందిలో ఉంది. దానికి సమాధానం ఇందులోని ఒక యాక్షన్ సీక్వెన్స్ అన్నది చిత్ర బృందం సమాచారం. ఇందులో హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉందట.
దాన్ని బాలీవుడ్లో టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ లాంటి యాక్షన్ హీరోల సినిమాల్లో మాదిరి భారీతనంతో తెరకెక్కించారట. అది తెలుగు సినిమా స్థాయిని పెంచేలా ఉంటుందని.. అందులో షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్, చిజిల్డ్ బాడీ చూపిస్తూ సుధీర్ చేసిన యాక్షన్ విన్యాసాలు వావ్ అనిపిస్తాయని అంటున్నారు.
దీనికి సంబంధించి ఇప్పటికే సుధీర్ లుక్ ఒకటి రిలీజ్ చేశారు. ట్రైలర్లోనూ ఒక షాట్ అలా మెరిసి మాయమైంది. క్యారెక్టర్, పెర్ఫామెన్స్ పరంగా నాని ఎంత డామినేట్ చేసినా.. ఈ సీక్వెన్స్‌లో మాత్రం సుధీర్ హైలైట్ అయ్యాడని.. అతడికి అదొక్కటి చాలని అంటున్నారు. చూద్దాం సెప్టెంబరు 5న ఆ సీక్వెన్స్‌లో అంత ప్రత్యేకత ఏముందో?
This post was last modified on August 28, 2020 8:13 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…